హీరోగా నాకు ఎంతో సంతృప్తినిచ్చిన సినిమా ఇది : కార్తికేయ

Anilkumar
'RX100' హీరో కార్తికేయ హీరోగా ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భజే వాయు వేగం సినిమా ఇటీవల థియేటర్స్ లో రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కార్తికేయ సరసన ఐశ్వర్య  మోహన్ నటించగా రాహుల్ టైసన్ ఇందులో పలు కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయింది. దానితో హైదరాబాదులో గురువారం థాంక్స్ మీట్ నిర్వహించారు. ఆ సందర్భంగా హీరో కార్తికేయ ఈ సినిమా గురించి మాట్లాడుతూ....."హీరోగా ఈ సినిమాలో నటించడం నాకెంతో సంతృప్తినిచ్చింది. నేను ఎలాంటి సినిమా చేయాలో అర్థం కాని సమయంలో దర్శకుడు ప్రశాంత ఈ సినిమా కథ వినిపించి నాకు దారి చూపించారు. విజయమని ఒక టార్చ్ లైట్ ని ఇచ్చారు. 

అయితే గతంలో నా గురించి రాసేటప్పుడు మరో అపజయం అందుకున్నాడని రాసేవారు. ఇక ఈ ఏడాదిలో రెండు హిట్ సినిమాలు అందుకున్నాను అని రాస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అభిమానులు నాపై పెట్టుకున్న నమ్మకంని నిలబెట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలు చేస్తా అంటూ చెప్పుకు వచ్చారు. ఇక దర్శకుడు ప్రశాంత్ "ఇది మంచి సినిమా కాబట్టి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చి వాళ్ళ మాటలతో ఈ సినిమా గురించి అందరికీ తెలిసేలా చేశారు. యూవీ సంస్థలో నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నానని భావిస్తున్నాను". అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు.

ఇక ఈ కార్యక్రమంలో రాహుల్ టైసన్,ఐశ్వర్య ,జి సత్య కపిల్ కుమార్, మధు శ్రీనివాస్, తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉండదా విజయ్ సేతుపతి చిత్రం మహారాజా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఇక ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది. నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా సుధన్ సుందరం, జగదీష్  పళనిస్వామి నిర్మించిన మూవీ ఇది. ఇక ఈ సినిమాను తెలుగు రాష్ట్రంలో ఎస్.వి.ఆర్ సినిమా సంస్థ రిలీజ్ చేస్తుంది. మోహన్ దాస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మమతా మోహన్ దాస్, నట్టి, భారతీ రాజా, అభిరామి, తదితరులు ఈ సినిమాలో నటించారు. ఇక ఈ చిత్రానికి బి అజనీష్ లోక్నాథ్ సంగీతాన్ని అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: