సూర్య 'కంగువ' థియేటర్స్ లోకి వచ్చేది అప్పుడేనా?

Anilkumar
తమిళ్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఈయన తమిళ, తెలుగు సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా సూర్య "కంగువ" సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఇక సూర్య శివ దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో  తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రిందటే పూర్తయినప్పటికీ గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తి అవ్వకపోవడం వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా అవుతూ వస్తుంది. ఈ మూవీ కి సంబంధికి  ఒక తాజా అప్డేట్ బయటికి  వచ్చింది. 

ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి వస్తున్న అప్డేట్స్ పై ప్రేక్షకులలో మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఆఫిషియల్ గా ఈ సినిమా నుండి తాజాగా పదివేల మందితో ఒక వార్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నట్టుగా యూనిట్ నుండి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. 

ఇక దానితో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. సూర్య, బాబీ డియోల్  ఇద్దరి మధ్య దానికి తగ్గట్టుగానే  పది నిమిషాల పాటు ఫైట్ ఉండబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంతో మరోసారి ఈ చిత్రం వార్తల్లో నిలిచింది. ఇప్పటివరకు డైరెక్టర్ శివ అన్ని కమర్షియల్ సినిమాలు మాత్రమే చేశాడు. ఆయన గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ తో డిఫరెంట్ అటెంప్ట్ ను ఇప్పుడు ట్రై చేస్తున్నాడు. అయితే ఇక ఈ సినిమాతో తాను సూపర్ సక్సెస్ అవుతాడని చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.స్టూడియో గ్రీన్ , UV క్రియేషన్స్  సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని కథానాయికగా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: