మాది అందరి లాంటి లవ్ కాదు.. తాప్సి..!?

Anilkumar
ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ తాప్సి  గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు  అయితే తాప్సి తను ప్రేమించిన బ్యాట్మెంటన్ క్రీడాకారుడు మతియాస్ ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి చాలామందికి తెలిసి ఉంటుంది. మార్చ్ లో ఉదయపూర్ లో వీళ్ళిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇందులో భాగంగానే ఇటీవల  తన ప్రేమ ఎన్ని సంవత్సరాలు నడిచింది ఏంటి అన్న విషయాలను వెల్లడించింది. దీంతో ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ తాప్సి  చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నాయి. తాజాగా కాస్మోపాలిటీ ఇండియాకి ఇచ్చిన కొత్త

 ఇంటర్వ్యూలో ఆమె తన రిలేషన్ గురించి చెప్పారు.. మథియస్ బోతో తాను మొదటి చూపు ప్రేమలో అదేనండి లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌ కాలేదని చెప్పుకొచ్చింది తాప్సీ. మథియస్‌తో రిలేషన్ గురించి చాలా కాలం ఆలోచించినట్లు, వాళ్ల మధ్య సంబంధం ఎంత దూరం వెళ్తుందో చూడాలనుకుందట ఈ కర్లీ హెయిర్ బ్యూటీ తాప్సీ. "అథ్లెట్ల పట్ల నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ వంటిది కాదు. ఇది నిజంగా రియాలిటీలో ప్రాక్టికల్‌గా వర్క్ అవుతుందా అని చాలా సమయం తీసుకున్నాను. ఎందుకంటే ఒక రిలేషన్‌షిప్ అనేది చాలా

 ముఖ్యమైనది. అది ఎంతకాలం ఉంటుందో సాధ్యాసాధ్యాలు చూడాల్సిన అవసరం ఉంది. నేను అతనిని అభిమానించాను, గౌరవించాను. అంతేకాకుండా మేను ఎప్పుడూ కలుస్తూనే ఉన్నాం. అదే అతనిపై ప్రేమ పెరిగేలా చేసింది" అని ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ తాప్సి  తెలిపింది. నేను అతనిని ప్రేమించాను కానీ అతను నన్ను తిరిగి ప్రేమించడానికి దాదాపుగా నెల సమయం పట్టింది ఇక ఆయన గురించి ఎక్కడ అడిగినా కూడా మొదట నేను చెప్పే సమాధానం ఇదే ఇక ఆయనను కలిసిన తరువాతే నాకు నాకంటూ ఒక మగాడు ఉన్నాడు అని అనిపించింది అంటూ చెప్పింది తాప్సి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: