భారీ ధర కి పవన్ ఓజి మూవీ రైట్స్.. ఎంతో తెలిస్తే షాక్..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ ఇప్పుడు og అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. 90స్ బ్యాక్ డ్రాప్లో ఒక యాక్షన్ ఓరియంటెడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాకి ఓజి అనే పవర్ఫుల్ టైటి కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. టాలీవుడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన 75% షూటింగ్ పూర్తి అయ్యింది. మిగతా షూటింగ్ కోసం పవర్ స్టార్ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఇప్పుడే పొలిటికల్ పనులను పూర్తి చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి ఈ సినిమాకి డేట్స్ ఎప్పుడు ఇస్తాడు

 అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈసారి జరిగిన రాజకీయాల వల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఫ్యాన్ ఇండియా స్థాయిలో కాకుండా దేశవ్యాప్తంగా వినిపించింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయితే కనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు నేషనల్ వైడ్ గా వినపడుతుంది అని చెప్పొచ్చు. అంతేకాదు ఈ సినిమా గనక అలా విడుదలై భారీ విజయాన్ని అందుకుంటే గనుక తన నెక్స్ట్ సినిమాలకి ఇది బాగా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు పవన్

 సినిమాలకి భారీ బిజినెస్ కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఓజి సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాకి కూడా బిజినెస్ భారీ స్థాయిలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ ఉండడంతో పాటు పొలిటికల్ గా కూడా బాగా ఫేమ్ వచ్చింది. దీంతో మరింత ఎక్కువ బిజినెస్ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క ఓటీటీ రైట్స్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అదేంటంటే ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ఫ్లెక్స్ ఓజి సినిమా యొక్క  రైట్స్ను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లుగా సమాచారం వినబడుతోంది. దాదాపుగా 92 కోట్లు చెల్లించి ఈ సినిమా  రైట్స్ న్యూస్ సొంతం చేసుకున్నట్లుగా సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: