సూసేకి పాట పై కొరియన్ గ్రూప్ డాన్స్.. వీడియో వైరల్..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప 2. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే వరుస అప్డేట్స్ వేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే మొదట పుష్ప  ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా అది సోషల్ మీడియాలో దుమ్ము లేపింది. తాజాగా ఇప్పుడు సెకండ్ సింగిల్ కూడా విడుదల చేయగా ఇది సోషల్ మీడియాలో మాత్రం రచ్చ లేపుతోంది అని చెప్పొచ్చు. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన సూసేకి నా సామి అంటూ సాగే లిరికల్ సాంగ్ కి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రీల్స్ వస్తున్నాయి. సినీ సెలబ్రిటీలు సైతం ఈ పాట పై స్టెప్పులు వేసి సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోలను పంచుకుంటున్నారు.

ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ పాట పై కొరియన్ పాప్ సింగర్ అతని గ్రూప్ కలిసి స్టెప్పులు వేస్తారు. ఇక దానికి రష్మిక మందన సైతం స్పందించింది. ఇక రెండు మూడు రోజులుగా ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది.  మన తెలుగు పాట కేవలం ఇండియాలోనే కాకుండా అటు కొరియాలో కూడా దుమ్ములేపుతోందన్నమాట. ఇదిలా ఉంటే గత కొద్ది కాలంగా కొరియన్ సినిమాలు వెబ్ సిరీస్ సాంగ్స్ ఇండియా లోని ప్రేక్షకులు చూడడానికి బాగా ఇష్టపడుతున్నారు. అంతేకాదు ఓటీటీ లో సైతం కొరియన్ సినిమాలకి వెబ్

 సిరీస్ లకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్పుడు మన తెలుగు పాటకి కొరియన్స్ స్టెప్పులు వేయడంతో అందరూ ఆహా అంటున్నారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట ఎంత హిట్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్క కపుల్ కూడా స్టెప్పులు వేసే విధంగా ఆకట్టుకుంటుంది ఈ పాట. ఇక ఇందులో అల్లు అర్జున్ రష్మిక మందన వేసిన స్టెప్పులు అయితే అసలు మర్చిపోలేనిది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: