నన్ను బయట కూడా అలాంటి దాన్ని అని అనుకుంటున్నారు.. పొలిమేర హీరోయిన్..!?

Anilkumar
కరోనా సమయంలో ఓటిటి లు ఎంతలా ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అలాంటి ఓటిటి వేదికగా విడుదలైన చాలా సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక అలాంటి సినిమాల్లో పొలిమేరా సినిమా కూడా ఒకటి.  ఈ సినిమా విడుదలై ఎంతటి బ్లాక్ బాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చేతబడి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అందరిని భయపెట్టించే విధంగా ఉంది. అయితే ఈ సినిమా ద్వారా నటిగా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది కామాక్షి భాస్కర్ల. అప్పటికే కొన్ని సినిమాలు చేసిన ఈమె

 కేవలం ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఈ సినిమాలో డి గ్లామర్ పాత్రలో తనదైన నటనతో దంచి కొట్టింది ఈ చిన్నది. అయితే ఈ సినిమా తర్వాత తనకి వరస సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. అంతేకాదు ఎక్కువగా బోల్డ్ పాత్రల్లో నటించే అవకాశాలే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బోల్డ్ సినిమాల్లో నటించిన పై షాకింగ్ కామెంట్స్ చేసింది.. బోల్డ్‌ కంటెంట్‌లో నటించదన్న కారణంతో అవకాశాలు ఇవ్వరన్న కామాక్షి.. సినిమా ల్లో బోల్డ్‌గా

 నటిస్తే బయట కూడా అలాగే ఉంటారేమో అని తప్పుగా ఆలోచిస్తారని చెప్పుకొచ్చింది. మొదట్లో సాఫ్ట్‌ పాత్రలో నటించి ఆ తర్వాత బోల్డ్‌ పాత్రలు చేస్తే మెచ్చుకుంటారు.. అదే మొదటి నుంచి బోల్డ్‌ పాత్రల్లో నటిస్తే మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటారని కామాక్షి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఆ మైండ్ సెట్ మార్చుకోవాలని, యాక్టర్లను యాక్టర్లుగా చూడాలని కామాక్షి తెలిపింది. లీడ్‌ క్యారెక్టర్‌ అనగానే ముంబాయి, ఢిల్లీకి ఫోన్‌ చేసేస్తారని చెప్పుకొచ్చింది. ఇక తెలుగుమ్మాయిలకు ఇండస్ట్రీలో తగినంత న్యాయం జరగడం లేదన్న కామాక్షి.. తెలుగమ్మాయి లు వచ్చినా కూడా వాళ్లను సైడ్ క్యారెక్టర్లకే పరిమితం చేస్తున్నారని వాపోయింది. వాళ్లు ఎంతో కష్టపడుతున్నారు, సినిమా ల్లో ఆ కష్టం కనిపిస్తుంది, ఎలాంటి క్యారెక్టర్లు అయినా చేస్తాం అంటున్నారు అయినా కూడా అవకాశాలు ఇవ్వడం లేదని చెప్పుకొచ్చింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: