కొత్త సినిమాలతో బిజీ కానున్న సమంత..!?

Anilkumar
ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్  ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన సమంత ఇప్పుడు ఇండియాలోని నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే సమంత నాగచైతన్యాన్ని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ కొన్ని కారణాలవల్ల వీళ్లిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే విడాకుల తరువాత సమంతకి సంబంధించిన ఏవో ఒక వార్తలు సోషల్ మీడియాలో రావడం మొదలయ్యాయి. ముఖ్యంగా సమంత పై నెగిటివిటీ పెరిగింది అని

 చెప్పొచ్చు. విడాకుల డిప్రెషన్ వల్ల సమంతకి మయోసైటిస్ అనే వ్యాధి కూడా రావడం జరిగింది. విడాకుల  తర్వాత బాగా కృంగిపోయిన సమంత ఏరి కోరి ఈ వ్యాధిని తెచ్చుకున్నట్లు అయింది. అదే నాగచైతన్యతో కలిసి ఉంటే ఇలాంటివి రాకపోదు కదా అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మరి వీళ్లిద్దరి మధ్య విడాకులు తీసుకునే అంత పెద్ద గొడవలు ఏం వచ్చాయి అన్నదానిపై మాత్రం ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు ఈ జంట. అయితే నాగచైతన్య తో విలాకుల తర్వాత సమంత చేసిన దాదాపుగా సినిమా లలో ఎక్కువగా బోల్డ్ సన్నివేశాలు ఉండడం మనం గమనించవచ్చు. ఇక ఆయనతో విడాకుల తర్వాత సమంత పుష్ప అనే సినిమాలో  ఉ

 అంటావా మామ అనే ఒక ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ సమయంలో కూడా సమంత పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. ఇక దానిపై ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది సమంత.. విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నా సమయంలో పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందట. కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఇలాంటి పాట చేస్తే విమర్శలు ఎక్కువవుతాయని.. వద్దని చెప్పారట. కానీ ఐటెం సాంగ్ చేయకుండా ఉండేందుకు నాకు ఎలాంటి కారణం కనిపించలేదు. అలాంటప్పుడు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి. నేను ఎలాంటి తప్పు చేయడం లేదు. నా మ్యారేజ్ లైఫ్ లో కూడా నేను నిజాయతీగానే ఉన్నా అని సమంత పేర్కొంది. ఇక మయూసైటిస్ తర్వాత ఇప్పుడిప్పుడే కోల్కున్న సమంత మళ్ళీ సినిమాలతో బిజీ కావాలని చూస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: