దేవర లో ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి..!?

Anilkumar
త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు గా వార్తలు వినబడుతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు
 ఇక చివరి దశకి చేరుకున్న దేవర సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్

 అభిమానులు. హాయ్ వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ అప్డేట్స్ ఇప్పటివరకు ఈ అధికారికంగా బయట పెట్టకపోయినప్పటికీ ఏవో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న అజయ్ మాట్లాడుతూ.. దేవర గురించి పలు సంచలన విషయాలను బయట పెట్టాడు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.. అది ఏంటంటే.. కథ కథనం పరంగా కాదు ఎలివేషన్ పరంగా కూడా దేవర ఆఫ్ ది బెస్ట్ గా ఉంటుంది అంటూ చెప్పుకు వచ్చాడు. అంతేకాదు ఈ ఏడాదిలో రానున్న సినిమాలు అన్నిటిలో బెస్ట్ సినిమాగా దేవర

 నిలిచిపోతుంది అంటూ వెల్లడించాడు. దీంతో ప్రస్తుతం అజయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు మేకర్స్. ఆ తర్వాత రిలీజ్ కి కావలసిన అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటినుండే చక్కదిద్దుతున్నట్లు గా వార్తలు వినబడుతున్నాయి. ఇక దీని తర్వాత టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వార్ 2 సినిమాతో పరిచయం కాబోతున్నాడు. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై కూడా అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: