కూతురితో కలిసి స్నేహ రెడ్డి చిలిపి పనులు.. వీడియో వైరల్..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పుష్ప వన్ బ్లాక్ బస్టర్ కావడంతో దీనికి సీక్వెల్ నిర్మిస్తున్నారు దర్శకుడు. ఇకపోతే గతంలో వచ్చిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్కి జాతీయ అవార్డు సైతం వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమా సైతం భారీ విజయాన్ని అందుకోవాలి అని

 దర్శకుడు నానా విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. కాగా అల్లు అర్జున్ ఇందులో చాలా డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఊర మాసలుకులో కనిపించబోతున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతోంది. ఇదిలా ఉంటే ఇక అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిరంతరం తనకి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అల్లు స్నేహారెడ్డి. తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది. రెగ్యులర్గా తన ఫ్యామిలీకి సంబంధించిన మూమెంట్స్ ను సోషల్ మీడియా వేదికగా

 పంచుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె షేర్ చేసిన ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే.. స్నేహారెడ్డి షేర్ చేసిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా వైరల్ అవుతున్న స్నేహ రెడ్డి వీడియోలో కూతురితో కలిసి అల్లరి చేశారు. కూతురు అర్హతో కలిసి బబుల్ గేమ్ తింటూ.. దాన్ని బెలూన్ గా ఊదుతున్న వీడియోను షేర్ చేశారు స్నేహారెడ్డి. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియో పై అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కూతురు అర్హకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఆమె చేసే అల్లరి బన్నీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: