సినిమాల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ఊహించని స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఆయన విజయంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పదేళ్లుగా పోరాటం చేస్తూ ఇప్పటికి విజయాన్ని అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పార్టీ కూడా ఘన విజయాన్ని సాధించడంతో ఇప్పుడు మెగా అభిమానుల మనసు నిండిపోయింది అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంతటి విజయాన్ని సాధించడంతో ఆయన

 అభిమానుల గుండెల్లో అనేక అనుమానాలు మొదలయ్యాయి. అదేంటంటే రాజకీయాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు సినిమాల సంగతి ఏం చేస్తాడు అని ఒక సందిగ్ధంలో పడిపోయారు పవర్ స్టార్ అభిమానులు. మొన్నటి వరకు ఏ పదవిలేని ఆయన కావాలనుకున్నప్పుడు సినిమాలు చేసేవాడు. తీరిక దొరికినప్పుడల్లా జనంలోకి వెళ్లి వాళ్ళ సమస్యలను తెలుసుకునేవాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయనకి పదవి వచ్చిన తరువాత సినిమాలో చేయడం అస్సలు కుదరదు ఎందుకంటే ఎమ్మెల్యే గానే కాదు ఒక పార్టీ అధ్యక్షుడిగా కూడా చాలా బరువు బాధ్యతలు ఉంటాయి. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి క్షణం కూడా తీరిక దొరకదు. మరి ఇలాంటి క్లిష్టమైన

 పరిస్థితుల్లో పవర్ స్టార్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు తెరపైకి మరొక సమాచారం వినబడుతోంది. అదేంటంటే సినిమాల విషయంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కఠినంగానే నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసిన తర్వాత తన పూర్తి జీవితాన్ని మొత్తం సినిమాలకే పరిమితం చేయాలి అని పవర్ స్టార్ భావిస్తున్నట్లుగా సమాచారం వినబడుతోంది. ఈ నేపథ్యంలోనే జూన్ మూడవ వారం నుండి హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఓ జి కూడా సెప్టెంబర్ వరకు పూర్తి చేస్తాను అని చెప్పుకొచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సైతం చేస్తాడు. మరి ఈ సినిమాల తర్వాత అసలు సినిమాలు చేస్తాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: