దానికోసం ఇప్పటికీ రిస్క్ చేస్తూనే ఉన్న.. శృతిహాసన్..!?

Anilkumar
టాలీవుడ్ అందాల తార స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ బ్యూటీ దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన ఆడి పాడింది. అలాగే సీనియర్ హీరోల సరసన కూడా ఆడి పాడిన ఈ బ్యూటీ కేవలం నటనే కాకుండా తన గాత్రంతో కూడా అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆకట్టుకునే అందం తన అద్భుతమైన నటనతో అందరిని మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. అయితే ఇటీవల తన తండ్రి లోకనాయకుడు కమల్ హాసన్

 నటించిన లేటెస్ట్ సినిమా భారతీయుడు 2. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఆడియో లాంచ్ సైతం ఏర్పాటు చేశారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే ఆ వేడుకకు తనను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే ఆమె తన పాటలతో అందరినీ ఆకట్టుకుంది. అందులో భాగంగానే శృతిహాసన్ తన మ్యూజిక్ కెరియర్ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. దీంతో ఆమె చేసిన ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. 'ఒకవైపు సంగీతం, మరోవైపు నటనతో చాలా ఆనందంగా గడుపుతున్న రోజులివి. ఈ రెండింటితో కొనసాగుతున్న ఈ దశ నాకెంతో ప్రత్యేకమైనది. గడిచిన రోజుల కంటే ఇప్పుడే ఎక్కువ రిస్కీ

 పనులు చేస్తున్నానని చెప్పాలి. నా కెరీర్‌ సంగీతంతోనే మొదలైంది. ఆ తర్వాతే సినిమాలు, నటన నా జీవితంలోకొచ్చాయి. నేను ఇష్టపడేవి రెండూ నా జీవితంలో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నా' అని అంది. తన తండ్రి ముందు, 'భారతీయుడు 2' ఆడియో వేడుకలో ఆమె చేసిన సంగీత ప్రదర్శన పట్ల ఆనందాన్ని పంచుకుంటూ.. 'అదొక అందమైన అనుభవం. మా నాన్నని సంగీతంతో సత్కరించేందుకు ఆ వేడుకకి నన్ను ఆహ్వానించినందుకు గర్వంగా ఉంది. నా పాటల్ని ఎప్పుడూ మా నాన్నతో పంచుకుంటూ ఉంటా' అంటూ ముచ్చటించిందీమె. దీంతో శృతిహాసన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: