స్టార్ హీరో సినిమాకి నో చెప్పిన సమంత.. టాలీవుడ్ ను వదిలేస్తుందా..!?

Anilkumar
నంబర్ వన్ హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే దాదాపుగా అందరి స్టార్ హీరోలు సరసన ఆడి పాడింది ఈ బ్యూటీ. కేవలం స్టార్ హీరోలతో నటించడమే కాకుండా లేడి ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసి అలా కూడా మంచి గుర్తింపు  తెచ్చుకుంది. ఇక నాగచైతన్యతో ప్రేమ వివాహం చేసుకున్న సమంత కొద్ది కాలానికి విడాకులు తీసుకుంది. అలా చైతన్యత విడాకులు తరువాత సమంతా కెరియర్ మొత్తం డౌన్ అయిపోయింది అని చెప్పడంలో ఎటువంటి

 సందేహం లేదు. విడాకుల తర్వాత సమంత సినిమాలపై ఫోకస్ చేయడం మానేసింది అని చెప్పొచ్చు. విడాకులు తర్వాత ఆమె చేసిన సినిమాలు వేళ్లపై లెక్కపెట్టొచ్చు. చేసింది తక్కువ సినిమాలే  ఆ సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకోలేకపోయాయి. అలా   కొంతకాలం తర్వాత ఖుషి సినిమా చేసింది. చేసిన అన్ని సినిమాల్లో ఈ సినిమా కాస్త బెటర్ అని అనిపించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు సమంతకి రామ్ చరణ్తో కలిసి నటించిన అవకాశం వచ్చింది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక వైరల్

 అవుతున్నాయి. అయితే రాకరాక ఒక స్టార్ హీరో తో సినిమా చేస్తే అవకాశం వస్తే చేతులారా ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నట సమంత. అవును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో నటించిన అవకాశాన్ని వద్దు అని చెప్పిందట సమంత. దీంతో ఇటు రాంచరణ్ అభిమానులు అటు సమంతా అభిమానులు షాక్ అవుతున్నారు. కెరియర్ పరంగా ఇప్పుడు బాగా డౌన్ లో ఉన్న సమంతకి మంచి కం బ్యాక్ ఇవ్వడానికి వచ్చిన స్టార్ హీరో సినిమాలను కూడా ఎందుకు వద్దంటుంది అంటూ ఇప్పుడు ఫ్యాన్స్ ఒకింత సమంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం వేరే లాగా చెబుతున్నారు. ప్రస్తుతం సమంత అత కాన్సన్ట్రేషన్ మొత్తం బాలీవుడ్ హాలీవుడ్ పై పెట్టింది అని.. అందుకే టాలీవుడ్ లో వస్తున్నా అవకాశాలను చేతులార మిస్ చేసుకుంటుంది అని అంటున్నారు. ఇకపోతే సమంత తెలుగులో సినిమాలు చేసిన చెయ్యకపోయినా తనకి ఉన్న గుర్తింపు మాత్రం ఎప్పటికీ పోదు. తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఆమెకి ఉన్న క్రేజ్ ఎప్పటికి తగ్గదు అని అంటున్నారు మరికొందరు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: