అన్నయ్య ముందే బట్టలు విప్పమనేవారు.. ఆమని షాకింగ్ కామెంట్స్?

praveen
నిన్నటి తరం హీరోయిన్లలో ఆమని కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు హీరోయిన్గా ఆమె మంచి హవా నడిపించారు. ఇక ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించి తన పాత్రలతో ఆకట్టుకున్నారు. అయితే కేవలం హీరోయిన్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించి తనలోని నటిని నిరూపించుకున్నారు అన్న విషయం తెలిసిందే  అయితే ఆమని ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకున్నారు  వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా మెరుస్తూ.. బిజీ బిజీగానే కొనసాగుతున్నారు.

 ఇక ఈ మధ్యకాలంలో ఎన్నో బుల్లితెర  షోస్ లలో కూడా సందడి చేసింది ఆమె. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ హీరోయిన్ ఆమని క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ గురించి ఎప్పుడు ఎవరో ఒకరు ఈ మధ్యకాలంలో మాట్లాడటం జరుగుతూనే ఉంది  ఈ క్రమంలోనే ఆయా సెలబ్రిటీలు మాట్లాడిన విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఇక ఇటీవల ఆమని చేసిన కామెంట్స్ కూడా ఇలాగే హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి.

 చిత్ర పరిశ్రమ అన్న తర్వాత ఇబ్బందులు ఉండడం కామన్ అంటూ ఆమని చెప్పుకొచ్చింది. అలనాటితర సావిత్రి కాలం నుంచి హీరోయిన్స్ ఇలాంటి సమస్యలను పేస్ చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం కారణంగా ప్రతి ఒక్కటి కూడా బయటికి వస్తుంది అంటూ తెలిపింది. ప్రొఫెషన్ అన్న తర్వాత మంచి చెడు రెండు ఉంటాయని.. కష్టాలను దాటుకుని ఎవరైనా స్టార్ గా ఎదుగుతారు అంటూ తెలిపింది. నేను తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేముందు క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నారు. కొంతమంది అయితే నన్ను మా అన్నయ్య, అమ్మ ముందే డ్రెస్ తీసి చూపించమని అడిగేవారు ఆ రోజులు గుర్తుకు వస్తే భయం వేస్తూ ఉంటుంది. ఆ మాటలు విని లేచి వచ్చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అంటూ ఆమని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: