రజనీకాంత్ జైలర్ 2 లో ఆ టాలీవుడ్ స్టార్ హీరో..!?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.  వయసుతో సంబంధం లేకుండా డిఫరెంట్ కథలు ఎంచుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఆయన ఇటీవల జైలర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపుగా 500 కోట్లు రాబట్టిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ కూడా తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులతో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ బిజీగా ఉన్నట్టుగా సమాచారం వినబడుతోంది. అయితే తాజాగా ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో ఒక టాలీవుడ్ స్టార్ హీరో కూడా ఉన్నట్లుగా

 వినబడుతోంది. ఆయన ఇందులో కీలక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ టాలీవుడ్ స్టార్ హీరో మరెవరో కాదు నందమూరి నటసింహ బాలకృష్ణ. అయితే బాలయ్య ఇందులో ఒక కీలకమైన అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం వినబడుతోంది. గ్యాంగ్ స్టార్ గా ఆయన పాత్ర ఉండబోతుందట. అంతేకాదు ఈ పాత్ర సినిమాకి చాలా కీలకంగా ఉంటుంది అని అంటున్నారు. ఇదివరకే మొదటి భాగంలో మోహన్లాల్ శివరాజ్ కుమార్ అతిధి పాత్రలో కనిపించారు. ఇక వాళ్లకి ఇందులో

 నటించినందుకు గాను మంచి మార్కులే పడ్డాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు వస్తున్న సీక్వెల్ లో నందమూరి బాలకృష్ణ గెస్ట్ రోల్ లో కనిపిస్తాడట. దీంతో ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు తన 19వ సినిమా లో నటించబోతున్నాడు. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: