ఫుల్ జోష్ లో సీనియర్ హీరోయిన్.. యంగ్ బ్యూటీస్ కి పోటీగా జ్యోతిక..!?

Anilkumar
ఒకప్పటి సీనియర్ హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా సక్సెస్ఫుల్ హీరోయిన్గా కొనసాగిన ఈమె ఎక్కువగా తెలుగు సినిమాల్లోని నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అలా అక్కడ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ హిందీలో తనకి పెద్దగా గుర్తింపు రాలేదు. అలాగే ఎక్కువగా సినిమాల్లో నటించే అవకాశాలు కూడా దక్కలేదు. దానికి కారణం ఏంటి అన్న విషయాన్ని కూడా జ్యోతిక పలు ఇంటర్వ్యూస్ లో వివరించింది. దీంతో ఆమె చేసిన పలు కామెంట్లు  సోషల్ మీడియా

 వేదికగా వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల ఆమె నటించిన సైతాన్ అనే సినిమా విడుదల అయింది. ఇక ఇందులో అజయ్ దేవగన్ సరసన హీరోయిన్గా నటించింది ఈమె. కాగా ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించింది. అలాగే ఇప్పుడు ఈ సినిమా తర్వాత హిందీలో శ్రీకాంత్ అనే సినిమాలో రాజ్ కుమార్ రావుతో కలిసి నటించబోతోంది. ఇక ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాల్లో నటించి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి గుర్తింపును సంపాదించుకున్న జ్యోతిక ఇప్పుడు అదే స్థాయిలో బాలీవుడ్ లో సినిమాలు

 చేస్తూ బిజీగా ఉంది. ఒకప్పుడు బాలీవుడ్ లో ఈమెకి తగిన ఆఫర్స్ లేక సతమతమైంది. కానీ ఇప్పుడు మాత్రం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తెలుగు హిందీలో పలు సినిమాలు చేసి ఇండస్ట్రీకి కాస్త బ్రేక్ ఇచ్చిన జ్యోతి ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అలా సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. దీంతో జ్యోతిక కి సంబంధించిన ఈ విషయం ఆటో టాలీవుడ్ ఇటు బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది .అంతేకాదు ఈ వయసులో కూడా అదే జోరు చూపిస్తోంది జ్యోతిక. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటుంది ఈ సీనియర్ హీరోయిన్.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: