బంపర్ ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్డే..!?

Anilkumar
మాస్క్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది పూజ హెగ్డే. తన మొదటి సినిమా యావరేజ్ అయినప్పటికీ కూడా తన రెండో సినిమా 'ఒక లైలా కోసం'  హిట్ ను అందుకుంది. దాని తర్వాత హిట్ ఫ్లాప్ అని లేకుండా వరుస సినిమాలు చేసి అభిమానులను ఆకట్టుకుంది. ఇక రామ్ చరణ్ సరసన ఆచార్య సినిమాలో నటించిన పూజా హెగ్డే. ఆ సినిమా కూడా స్లాప్ అవ్వడంతో దాన్ని తర్వాత అంతగా సినిమా ఆఫర్లు రావట్లేదు. ఆమెకు గత కొంతకాలంగా సినిమా ఛాన్సులు రాకపోవడంతో రేసులో పూర్తిగా వెనుకబడిపోయింది.

 అయితే ఓ ఇంటర్వ్యూలో ఈమె మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పుకొచ్చింది. ఆమె చెప్పినట్లే  తనకు ఆ ఛాన్స్ దక్కింది. తమిళంలో ఓ సినిమా చేసే బంపర్ ఆఫర్ అని అందుకుంది ఈ బొమ్మ .సూర్య పిరియాడికల్ సినిమా 'కంగువ' ఇందులో సూర్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా పూర్తి కాగానే పూజ హెగ్డే మరో సినిమా చేయబోతోంది. వెంకటేష్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రియాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటించబోతోంది. సూర్య నటించబోతున్న 44వ మూవీ ఇది. ఈ నెలలోనే సెట్స్ మీదకు

 వెళ్లనుంది ఈ చిత్రం.తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే ని  ఖరారు చేశారు. తమిళంలో పూజ హెగ్డే ' బిస్ట్' సినిమా తర్వాత మరో మూవీ లో నటించలేదు. ఇక చాలా కాలం విరామం తీసుకున్న తర్వాత భారీ అవకాశాన్ని అందుకోవడం విశేషం. ఈ సినిమాతో తన కెరీర్ మళ్ళీ కొనసాగాలని మళ్లీ తన పూర్వ వైభవాన్ని సాధిస్తుందని అభిమానులు ఎంతో ఆశిస్తున్నారు. తను ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్న కానీ తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక ఆమె అభిమానులు తనకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: