నాకు ఆ విషయంలో ఏం ప్రాబ్లం లేదు.. తమన్నా..!?

Anilkumar
తమన్నా, రాశి కన్నా వీళ్ళిద్దరూ జంటగా ఓ సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఏంటంటే 'అరణ్మణై 4' తెలుగులో ఈ సినిమా పేరు 'బాకు'. సుందర్ సి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెకబోతుంది. అయితే  సినిమాలో ఇద్దరూ హీరోయిన్లు ఉంటే వారి యాక్టింగ్ విషయాలలో పోలికలు  రావచ్చు. ఇంకొందరు పోటీలు పడి మరి యాక్టింగ్ చేస్తూ మాట్లాడుతుంటారు. అయితే తమన్నా నేను ఈ పోటీ ఆహ్లదకరంగానే తీసుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. తను అలా చెప్పడానికి ఒక కారణం ఉంది. సుందర్ సి లీడ్  రోల్స్ లో

 తమన్నా, రాసి కన్నా నటించిన తమిళ సినిమా అరణ్మణై 4. ఇక ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే. రాశి కన్నా తో కలిసి ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి తమన్నా ఒక ఆంగ్లం మీడియా సంస్థలో మాట్లాడింది. తమన్నా మాట్లాడుతూ...... 'సినీ ఇండస్ట్రీలో పోటి ఉండవచ్చు. అందులో మనం మనలా పర్ఫామెన్స్ చేస్తే చాలు. ఇక నేను రాసి కన్నా తో కలిసి అరణ్మణై 4 చిత్రంలో ఓ పాట లో నటించాం. ఇక మేమిద్దరం ఒకే ఫ్రేమ్ లోకి వచ్చాము. అప్పుడు మేమిద్దరం మా

 డాన్స్ మీదనే ఫోకస్ చేసి పర్ఫామెన్స్ చేశాము.  ఆ పాట బాగా రావడానికి రాసి కన్నా కూడా తన వంతు కృషి చేసింది. ఇక మేము ఇద్దరం ఒకరికొకరం సపోర్ట్ చేసుకోవడం వల్ల మాకు కెమిస్ట్రీ బాగా కుదిరింది. అయితే రాశి కన్నా కూడా సపోర్ట్ చేసిందని నాకు అనిపించింది. ఇక ఇద్దరి మధ్య ఇలా ఆహ్లాదకరంగా ఉంటే మంచిదే' అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ' అచ్చో అచ్చో అచ్చ అచ్చచ్చో' పాట సోషల్ మీడియాలో అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: