స్టార్ హీరోయిన్స్ గురించి పచ్చి నిజాలు బయటపెట్టిన కాజల్..!?

Anilkumar
నటి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు.  లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత మగధీర సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ద్వారా ఈమె స్టార్ హీరోయిన్ అనే గుర్తింపు తెచ్చుకుంది. ఇక వరుస సినిమాలు చేసే సమయంలో తన చిన్ననాటి స్నేహితుడైన గౌతం కిచ్లూ ను అందరి సమక్షంలో ప్రేమ వివాహం చేసుకొని పండంటి మగ బిడ్డను జన్మనిచ్చింది కాజల్. ఆ తర్వాత కొద్దికాలం సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. దాని తర్వాత భగవంత్ కేసరి సినిమాతో తిరిగి

 ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా హిట్ తర్వాత కాజల్  'సత్యభామ' సినిమా లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకులను అలరించనుంది. ఇది కాసేపు పక్కన పెడితే దక్షిణాదిలో హీరోయిన్లుగా మంచి గుర్తింపును తెచ్చుకుని దాని తర్వాత చాన్సులు రాకపోతే వారి మీద నిందలు వేయడం పొరపాటు. అయితే గతంలో ఇలియానా, తాప్సి, పూజ హెగ్డే ఇలా చేయగా ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా ఆ లిస్టులో చేరింది. ఇక తాజాగా కాజల్ అగర్వాల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో సౌత్ ఇండస్ట్రీ గురించి కొన్ని షాకింగ్

 విషయాలను తెలిపింది కాజల్... ఇక అందులో తను చెప్పిందంటే... 'దక్షిణాది లో హీరోయిన్లకు పెళ్లయితే బాగాలేరని పక్కన పెట్టిస్తారు అదే హిందీలో మాత్రం హీరోయిన్లకు పెళ్లి అయినా సరే సినిమాలలో నటిస్తుంటారు. షర్మిల ఠాగూర్, హేమమాలిని దగ్గర నుంచి దీపికా పడుకునే, ఆలియా భట్ లాంటి వాళ్లకు సినిమాలలో హీరోయిన్లుగా చేసే అవకాశాలు వస్తున్నాయి. అయితే దక్షిణాదిలో ఇలాంటి పరిస్థితి లేదు. దీనికి నయనతార అతీతం ఇక ఆ హీరోయిన్ మంచి సినిమాలు చేస్తుంది. ఇక దక్షిణాదిలో నెలకొన్న ఈ పరిస్థితిని త్వరలోనే మార్చాలి' అంటూ కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే సత్యభామ షూటింగ్ అంతా పూర్తి చేసుకున్నారు మేకర్స్. ఇక ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు జూన్ 7న రిలీజ్ కానంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: