పవన్ గెలవగానే.. ఆ ఇద్దరు హీరోల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారట?

praveen
సినిమాల్లో వచ్చే కోట్ల రూపాయలను విలాసవంతమైన జీవితాన్ని సైతం కాదని ఏకంగా జనం కోసం కదిలి జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. పదవి లేకపోయినా పోరాడుతూనే వచ్చారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు.. ఆయనకు ఒక భారీ విజయాన్ని కట్టబెట్టారు. పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థి వంగ గీతాపై 70 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు అన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ విజయంతో అభిమానులు అందరూ కూడా ఆనందోత్సాహంలో మునిగిపోయారు.

 కేవలం అభిమానులు మాత్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం హర్షం వ్యక్తం చేస్తుంది అని చెప్పాలి. ఎంతోమంది సెలబ్రిటీలు సినీ ప్రముఖులు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ హీరోలు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయన సాధించిన భారీ విజయం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇలా అందరూ పవన్ విజయంపై సంతోషం వ్యక్తం చేస్తున్న వేళ.. టాలీవుడ్ లోని ఇద్దరు హీరోలు మాత్రం పవన్ విజయం తర్వాత వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

 అయితే దానికి కారణం ఆ ఇద్దరు హీరోలకు వైసిపి గవర్నమెంట్ కి దగ్గర సంబంధాలు ఉండడమే అన్నది తెలుస్తుంది. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో ఎన్నో బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టి ఇక ఆ ప్రభుత్వంలోని నేతలతో చేతులు కలిపి ఇద్దరు తెలుగు హీరోలు జగన్ కు ఒకరు రైట్ హ్యాండ్ ఒకరు లెఫ్ట్ హ్యాండ్ అన్నట్లుగా ఉన్నారట. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు వైసీపీ నేతలు పవన్ ఫై విమర్శలు చేసిన ఇద్దరు హీరోలు పట్టి పట్టినట్లుగానే ఉన్నారట. ఇక ఇప్పుడు పవన్ విజయం సాధించగానే   ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని సైలెంట్ అయిపోయారట. ఇక ఈ న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: