సరిపోదా శనివారం కోసం భారీ సెట్.. రిస్క్ చేస్తున్న నాని..!?

Anilkumar
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల హాయ్ నాన్న సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇప్పుడు  శరవేగంగా జరుగుతుంది. వివేకాత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను డీ వీవీ దానయ్య కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా అరుణ్ మోహన్ నటించబోతున్నారు సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

 ఇప్పటికి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చివరి దశకు వచ్చింది అని సమాచారం వినబడుతోంది .ఇందులో భాగంగానే సినిమాకి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ వస్తోంది. అయితే తాజాగా ఇప్పుడు మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏంటంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ చేశారట చిత్ర బృందం. అంతేకాదు దీనికి సంబంధించిన ఒక భారీ సెట్ కూడా ఏర్పాటు చేశారట. ఇందుకోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఆ భారీ సెట్ లో నానికి

 సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది. రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పది రోజులకు పైగానే జరగబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ నేపథ్యంలో రాబోతోంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ  కన్నడ మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఆగస్టు 29న విడుదల కాబోతున్న ఈ సినిమాకి జేక్స్ విజయ్ చాయా గ్రహణం జి మురలీ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఇప్పటికే దసరా హాయ్ నాన్న వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని ఈ సినిమాలతో ఎటువంటి హిట్ కొడతాడో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: