'మానమే' కోసం అంత పెద్ద రిస్క్ చేస్తున్న టీం.. వర్క్ అవుట్ అవుతుందా..!?

Anilkumar
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కేవలం 5 నుండి 6 నిమిషాల పాటలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉన్న పాటలు మాత్రమే వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పెద్ద పెద్ద సినిమాలకి తగ్గట్లుగానే పెద్ద పెద్ద పాటలను పాడుతున్నారు. అలాగే సినిమాలో కచ్చితంగా మూడు ఫైట్లు ఆరు పాటలు ఉండాలి అన్న కాన్సెప్ట్ ఇప్పుడు ఏ సినిమాలో కూడా కనిపించడం లేదు. అయితే ఎందుకు ఇప్పుడు ఈ విషయాన్ని మాట్లాడుకుంటున్నాము అంటే ఒక యంగ్ హీరో నటిస్తున్న సినిమాలో

 ఏకంగా 16 పాటలు ఉండబోతున్నాయి అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే..  శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ సినిమా మనమే. యంగ్ హీరో శర్వానంద్ కృతి శెట్టి కాంబినేషన్లో వస్తున్న ఈ మొదటి సినిమా పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఇందులో భాగంగానే ఇప్పటికే ఇందులో నుండి విడుదల చేసిన పాటలు టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ నెల 7న  విడుదలై ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి

 సంబంధించిన ప్రమోషన్స్ ప్రస్తుతం శరవేగంగా జరుపుతున్నారు .ఇందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీరామ ఆదిత్య మనమే సినిమాలో మొత్తం 16 పాటలు ఉండబోతున్నాయి అని షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. ఇక ఈ వార్త విన్న తర్వాత సినీ లవర్స్ అందరూ ఈరోజుల్లో ఇన్ని పాటలు ఎవరు వింటున్నారూ.. ఎందుకు ఇందులో ఇన్ని పాటలు ఉన్నాయి అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.  ఒక్క సినిమాలో ఏకంగా 16 పాటలు అంటే మాటలు కాదు. ఇక సినిమా పట్ల ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే సినిమా కచ్చితంగా బాగుండే ఉంటుంది.  16 పాటలు ఉన్న ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే రిలీజ్ అయ్యేంతవరకు ఆగాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: