మహేష్, రాజమౌళి మూవీలో ఆ స్టార్ క్రికెటర్..!?

Anilkumar
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అవడంతో తన నెక్స్ట్ సినిమా పైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్ గా పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు అంటే అది మామూలు విషయం కాదు. ఇకపోతే

 ఈ సినిమాకి  దాదాపుగా మూడు వేల కోట్ల భారీ కలెక్షన్ రావాలి అని రాజమౌళి టార్గెట్ పెట్టుకొని దగ్గరుండి ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను చక్కదిద్దుతున్నట్లు గా సమాచారం వినబడుతుంది. అయితే కేవలం కలెక్షన్ పరంగా మాత్రమే కాకుండా మహేష్ బాబుకి పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపు రావాలి అని ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. అయితే ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ స్టార్ క్యాస్ట్ ను కూడా రంగంలోకి దింపుతున్నట్లు గా వార్తలు వినబడుతున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో ఒక స్టార్ క్రికెట్ ప్లేయర్ కూడా నటించబోతున్నాడు అన్న వార్తలు వినబడుతున్నాయి. ఆ స్టార్ క్రికెటర్ మరెవరో కాదు ఆస్ట్రేలియన్ క్రికెట్

 ప్లేయర్ అయిన డేవిడ్ వార్నర్.. ఆయనతోపాటు ఇండియన్ టీం దిగ్గజ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం వినబడుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో అసలు క్రికెటర్లు ఎందుకు కనిపిస్తారు అన్నది ఆశ్చర్యంగా మారింది. ఇక ఈ వార్త విన్న తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో క్రికెటర్స్ కనిపించబోతున్నారు అంటే ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఇందులో క్రికెట్ కి సంబంధించిన ఒక సీన్ ఉండబోతుందట దాన్ని బేస్ చేసుకుని ఇద్దరు స్టార్ క్రికెటర్లను ఇందులో పెట్టినట్లుగా వార్తలు వినబడుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: