ఇప్పుడు కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రియమణి.. మరి ఒకప్పుడు..!?

Anilkumar
టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటి ప్రియమణి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో సైతం తన అందాలను ఆరబోస్తూ ఆఫర్లు దక్కించుకుంటుంది ఈ బ్యూటీ. అంతేకాదు ఈ ముద్దుగుమ్మ కి జాతియ ఉత్తమ నటిగా కూడా అవార్డు దక్కింది. అటు వెండితెర ఇటు బుల్లితెరపై కూడా దూసుకుపోతోంది ప్రియమణి. అయితే నిన్న ప్రియమణి పుట్టినరోజు. ఇందులో భాగంగానే సినీ ప్రముఖులు ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  ప్రస్తుతం ఒకవైపు సినిమాలు మరొకవైపు వెబ్ సిరీస్ అలాగే టీవీ షోస్ కూడా చేస్తూ బిజీగా ఉన్నా ప్రియమణి దానికి తగ్గట్లుగానే కోట్లల్లో రెమ్యునరేషన్

 అందుకుంటుంది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. రాజ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ది ఫ్యామిలీ మెన్ సిరీస్ లో సుచిత్ర అనే పాత్రలో నటించి భారీ క్రేజ్ దక్కించుకుంది ప్రియమణి. ఇకపోతే ఇప్పుడు మూడవ సీజన్ కూడా రాబోతోంది. అయితే ఈ సీజన్ కోసం దాదాపుగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట ప్రియమణి. దీంతో ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు మాత్రం కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రియమణి ఒకప్పుడు ఎంత

 తీసుకుంది అన్న వార్తలుఎక్కువగా వినబడుతున్నాయి. అయితే ఇప్పుడు కోట్లలో  తీసుకుంటున్న ప్రియమణి మొదటి రమ్యునరేషన్ కేవలం 500 రూపాయలట. 2003లో తెలుగులో ఎవరే అతగాడు అనే సినిమాతో సినీ  పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. దాని తర్వాత కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం కన్నడ వంటి సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలు సరసన హీరోయిన్గా నటించే ఛాన్స్ కొట్టింది. అలా ప్రస్తుతం ఒకవైపు లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: