ఆ టైంలో నాకు పారితోషకం కూడా ఇవ్వలేదు.. షాకింగ్ విషయం చెప్పిన మహేష్?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో తొలితరం సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన మహేష్ బాబు తన నటనతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఏకంగా తండ్రి సినిమా లో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి ఇలా హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే కోట్లాది మంది గుండెల్లో ప్రత్యేక స్థానం దక్కించుకోగలిగాడు మహేష్ బాబు.

 అయితే ఇలా స్టార్ కిడ్ గా ఇండస్ట్రీకి పరిచయమైన.. తండ్రికి తగ్గ తనయుడుగా గుర్తింపును సంపాదించుకొని.. ఇక ఇప్పుడు తనదైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకటిగా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే మహేష్ బాబు కూడా వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండడం గమనార్హం. ఇలా ప్రస్తుతం టాప్ హీరోగా హవా నడిపిస్తున్న మహేష్ బాబు.. కెరియర్ మొదట్లో మాత్రం కొన్ని సినిమాలకు పారితోషకం లేకుండానే పనిచేశాడట.

 కేవలం ఖర్చులు తప్పితే పెద్దగా పారితోషకం ఏమి ఇవ్వలేదు అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. కమర్షియల్ హిట్స్ పడిన తర్వాతే పారితోషకం ఇవ్వడం మొదలుపెట్టారని తెలిపాడు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో ఈ విషయాన్ని వెల్లడించాడు మహేష్ బాబు  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ గా మారిపోయింది. అయితే మహేష్ బాబుకు మంచి కమర్షియల్ హీట్ వచ్చింది ఒక్కడు సినిమాతోనే. అంటే మహేష్ కి ఒక్కడు సినిమా తర్వాతే పారితోషకం అందింది అని అందరూ అనుకుంటున్నారు. ప్రగ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో ఒక ప్రతిష్టాత్మకమైన సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: