కాజల్ లా సమంత ఆ పని చేసుంటే.. ఇంతవరకు వచ్చేది కాదేమో?

praveen
ఏం మాయ చేసావే అనే సినిమాతో  తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైన సమంత.. తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. తన కో స్టార్స్  అయినా అక్కినేని హీరో నాగచైతన్యను కూడా మాయ చేసేసింది. ఏకంగా మొదటి సినిమా నుంచి వీరిద్దరి మధ్య ప్రేమాయణం పుట్టింది అన్న విషయం తెలిసిందే. వీరి ప్రేమ చివరికి పెళ్లి వరకు వెళ్ళింది. కానీ పెళ్లి తర్వాత మాత్రం ఎంతో కాలం వీళ్ళ దాంపత్య బంధం నిలువలేదు. చివరికి విడాకులు తీసుకుని నాగచైతన్య సమంత వేరుపడ్డారు అన్న విషయం తెలిసిందే.

 వీరి విడాకుల తర్వాత నాగచైతన్య, సమంత గురించి ఏ విషయం తెర మీదకి వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది అని చెప్పాలి. మరి ముఖ్యంగా విడాకుల తర్వాత సమంతను నేటిజన్స్ అందరు కూడా దారుణంగా టోల్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇలా సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని ఏళ్లు గడుస్తున్న.. వీరిద్దరిఫై  ట్రోలింగ్ మాత్రం అసలు ఆగడం లేదు. అయితే ఇక ఇప్పుడు సమంత పేరును తెరమీదకి తెచ్చి మరో ట్రోలింగ్ మొదలుపెట్టారు నెటిజెన్స్.

 సమంత తోటి హీరోయిన్ అయినా కాజల్ అగర్వాల్ చేసిన ఒక్క పని సమంత చేసి ఉంటే.. ఎప్పుడో లైఫ్ బాగుపడి ఉండేది అని కొంతమంది సజెషన్స్ ఇస్తున్నారు. సమంత లాగానే కాజల్ అగర్వాల్ కూడా స్టార్ హీరోయిన్గా హవా నడిపిస్తుంది. అయితే ఈమె కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన వెంటనే ఒక బాబుకు జన్మనిచ్చేసింది. తర్వాత వైవాహిక బంధం ఎంత సాఫీగా ముందుకు వెళ్తుందో అందరికీ తెలిసిందే. కానీ సమంత అలా చేయలేదు. పెళ్లి తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది. ఈ గ్యాప్ లో భర్తతో మనస్పర్ధలు  మొదలయ్యాయి   చివరికి విడాకులు తీసుకునేంతవరకు వెళ్ళింది. కాజల్ లాగానే వెంటనే సమంత పిల్లలు కని ఉంటే ఇక పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేది కాదని ఎంతో మంది నేటిజన్స్  అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: