బుచ్చిబాబు సినిమా కోసం.. చరణ్ మరీ ఇంత రిస్క్ చేస్తున్నాడా?

praveen
రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న రాం చరణ్ ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ అనే మూవీలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతుంది అని చెప్పాలి. ఇక ఈ మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 అయితే శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఇంకా అవ్వనే లేదు ఇక ఇప్పుడు మరికొన్ని సినిమాలను కూడా లైన్లో పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉప్పెన సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు చరణ్. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది అని చెప్పాలి. అయితే ఈ మూవీలో ఇప్పటివరకు అభిమానులు మునుపేన్నడు చూడని పాత్రలో చరణ్ కనిపించబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఇక బుచ్చిబాబు సినిమా కోసం ఒక రిస్కీ పని చేస్తున్నాడట రామ్ చరణ్.

 ఈ సినిమా కోసం కర్ర సాము నేర్చుకుంటున్నాడట ఈ మెగా హీరో. ఒక కీలకమైన సన్నివేశంలో కర్రసాము చేయాల్సి ఉంటుందట. ఇక కర్రసాము నేర్చుకోవడం కోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటున్నాడట. ముందుగా ఈ సీన్ డూప్ తో చేయించుకుందాం అని చెప్పినప్పటికీ.. రామ్ చరణ్ మాత్రం తాను కర్ర సాము నేర్చుకొని డూప్ లేకుండా నటిస్తానని డైరెక్టర్ బుచ్చిబాబుకు చెప్పాడట. అయితే చరణ్ చెప్పిన మాటతో అటు బుచ్చిబాబు కూడా ఫిదా అయిపోయాడట.  గ్లోబల్ స్టార్ రేంజ్ లో ఉండి కూడా చరణ్ ఇంత కష్టపడుతున్నాడు అని అనుకున్నాడట. ఈ విషయం తెలిసి ఈ సినిమాపై అంచనాల పెరిగిపోతున్నాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: