ఓటిటి స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న గెటప్ శ్రీను రాజు యాదవ్.. ఎప్పుడంటే..!?

Anilkumar
బుల్లితెరపై నంబర్ వన్ కామెడీ షో గా ఎన్నో ఏళ్ల నుండి ప్రసారమవుతున్న జబర్దస్త్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఈ జబర్దస్త్ షో ఎందరికో జీవితాన్ని ఇచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎక్కడినుండో చిన్న చిన్న ఆర్టిస్టులుగా జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోలుగా ఎదిగిన వారు ఉన్నారు. మొదట జబర్దస్త్ లోకి వచ్చి ఆ తర్వాత చిన్న చిన్న సినిమాల్లో నటించే అవకాశాలను దక్కించుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోని టాప్ కమెడియన్ గా రాణిస్తున్నారు. చాలామంది పెద్దపెద్ద స్టార్ హీరో సినిమాల్లో కీలకపాత్రలో నటించే అవకాశాలను సైతం అందుకుంటున్నారు. ఇక అలాంటి వారిలో గెటప్ శ్రీను ముందు వరుసలో

 ఉంటాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్ని గంటలు అయినా సరే ఏకధాటిగా నవ్వించగల సత్తా ఉన్న గెటప్ శ్రీను ఇటీవల హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇంతకాలం పలు హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్గా చేసిన గెటప్ శ్రీను హీరోగా కృష్ణమాచారి దర్శకత్వంలో రాజు యాదవ్ అనే సినిమా చేశాడు. ఇక ఈ సినిమా మే 24 ల థియేటర్స్ లో విడుదల అయింది. థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న  ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నట్లుగా సమాచారం వినపడుతోంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటి సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా జూన్ 22 నుండి ఓటీటి లోకి

 రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే జబర్దస్త్ ఫేమ్ కమెడియన్ గెటప్ శ్రీను హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయనకు జోడిగా అంకిత హీరోయిన్ పాత్రలో కనిపించింది. ఆమెతోపాటు ఆనందచక్రపాణి రాకెట్ రాఘవ మిర్చి హేమంత జబర్దస్త్ సన్నీ తోపాటు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సాయి వరుణవి క్రియేషన్స్ చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కే ప్రశాంత్ రెడ్డి రాజేష్ కల్లేపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి హర్షవర్ధన్ పరమేశ్వర్ సంగీతాన్ని అందించారు. ఇక సినిమా విడుదల కంటే ముందే టీజర్ ట్రైలర్ పాటలతో పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ కనబరిచింది. మరి ఓటీటీ లో ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: