'నాలో ఆ పార్ట్ అంటే నాకు చాలా ఇష్టం'.. అనుపమ పరమేశ్వరన్..!?

Anilkumar
టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రేమంమ్ సినిమా తో సిని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ దాని తర్వాత వరుస సినిమాలు చేసి బిజీగా మారింది .మొదటి నుండి ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉన్న ఈమె గత కొంతకాలంగా బోల్డ్ సన్నివేశాల్లో విచ్చలవిడిగా నటిస్తోంది. ఈమె ఎంచుకునే పాత్రల ను చూసి ఇప్పుడు ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఇక ఆ నాలుగు సినిమాలు కూడా పెద్ద హీరోల సినిమాలు కావడం

 విశేషం. అయితే తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది. అదేంటంటే "నేను ఆనందించే ఏకైక నాటకం నా కనురెప్పలలో మాత్రమే ఉంటుంది" అంటూ తన కళ్ళకి సంబంధించిన ఒక ఫోటోని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. దాంతో ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఎప్పుడూ చాలా పద్ధతిగా అమాయకంగా కనిపించే అనుపమ పరమేశ్వరన్ ఉన్నట్టుండి బోల్డ్ సన్నివేశాల్లో నటించడం ప్రారంభించింది. అయితే ఎందుకు

 అనుపమ ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంది అంటూ ఆమె అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇటీవల అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ రెచ్చిపోయి మరీ బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. ఏకంగా లిప్ లాక్ సన్నివేశాలు చేసింది. దీంతో ఒక్కసారిగా ఆమె నటన చూసి అందరూ షాక్ అయ్యారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో కూడా ఇటువంటి సన్నివేశాలు నటించడం పై స్పందించిన అనుపమ. ఎప్పుడూ ఒకేలా చేస్తే కొత్త ఏముంటుంది అందుకే ఇలాంటి సన్నివేశాలు నటిస్తున్నాను అంటూ క్లారిటీ కూడా ఇచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: