షాకింగ్ : ఆ యంగ్ హీరోతో సినిమాకి రెడీ అయిన సమంత..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ అనే ఒక వ్యాధితో బాధపడుతున్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇందులో భాగంగానే గత కొద్ది రోజులుగా సినిమాలకి దూరంగా ఉన్న సమంత చికిత్స తీసుకుంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. మయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటూనే మరొకవైపు తన పీస్ ఫుల్ టైం ను ఎంజాయ్ చేసింది. అలా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంతా మల్లి ఇప్పుడు సినిమాలతో బిజీ కావాలి అని

 ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఒక యంగ్ హీరో తో సినిమా చేయడానికి సిద్ధమైంది అన్న వార్తలు వినబడుతున్నాయి. అసలు మయోసైటిస్ నుండి కోలుకున్న తర్వాత తెలుగు సినిమాల చేయకూడదు అని ఫిక్స్ అయిన సమంత ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో యంగ్ హీరోతో సినిమా చేయడానికి సిద్ధమైనట్లుగా సమాచారం. అంతేకాదు తప్పని పరిస్థితుల్లో ఆ యంగ్ హీరోతో సినిమా చేయడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న సమంత టాలీవుడ్

 స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న ఒక లేటెస్ట్ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం వినబడుతుంది. ఇక ఈ సినిమాకి రచయితగా త్రివిక్రమ్.. నాగ వంశీ త్రివిక్రమ్ భార్య సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత సమంత అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు సిద్దు జొన్నలగడ్డతో సమంతా సినిమా చేయడ మేంటి.. ఇదివరకు పెద్దపెద్ద స్టార్స్ సినిమా చేసిన సమంత చిన్న హీరోలతో సినిమా చేయడం ఏంటి అని షాక్ అవుతున్నారు. అదేవిధంగా అసలు సిద్దు జొన్నలగడ్డ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇయ్యడానికి వెనక కారణం ఏంటి అని ఆరాతీస్తున్నారు. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలి అంటే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: