సిద్ధార్థ్, అథితి ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..!?

Anilkumar
హీరో  సిద్ధార్థ హీరోయిన్ అతిధిరావు హైదరి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు అన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే తాజాగా ఈ జంట నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కేవలం ఇరు కుటుంబ సభ్యుల మధ్య రహస్యంగా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకున్నారు ఈ జంట. అయితే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత నుండి త్వరలోనే పెళ్లి ఉండబోతోంది అన్న వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు

 అయితే ఈ జంట పెళ్లిపై ఎటువంటి అధికారికి ప్రకటన ఇవ్వలేదు. ప్రస్తుతం ఇద్దరు కూడా ఎవరి షూటింగ్స్ లో వాళ్లు బిజీగా ఉన్నారు. కానీ తాజాగా మాత్రం వీళ్ళిద్దరికీ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది అని త్వరలోనే పెళ్లి జరగబోతోంది అని సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళిద్దరి పెళ్లి డిసెంబర్లో జరగబోతుంది అని పెద్దలు ఇదే ముహూర్తానికి వీళ్ళ పెళ్లి ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారికి ప్రకటన కూడా వెలువడుతుంది అని

 అంటున్నారు. ఇక వీళ్లిద్దరి సినిమాల విషయానికి వస్తే..  సిద్ధార్థ్ ఇండియన్ టు సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో లోకనాయకుడు కమలహాసన్ ప్రధాన పాత్రలో నటించిన సంగతి మనందరికి తెలిసిందే. కాగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో జూలై 12న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా కంటే ముందు సిద్ధార్థ్ చిన్న అనే సినిమాలో నటించాడు. బాబాయ్ కూతురు ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఆ సినిమా బాగానే ఆకట్టుకుంది.  ఆ సినిమా తర్వాత సిద్ధార్థ చేస్తున్న మూవీ ఇండియన్ టు. మరి ఈ సినిమాతో సిద్ధార్థ ఎటువంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: