ఆ యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత..!?

Anilkumar
పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి మరింత క్రేజ్ ను సొంతం చేసుకుంది సమంత. ఇక దాని తర్వాత కె ఆర్ కె, యశోద వంటి సినిమాలలో నటించి మరో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. తనకు ఆరోగ్య సమస్య ఉన్నా కూడా యశోద సినిమాలో ప్రాణం పెట్టి పాత్రను పోషించింది. ఆ తర్వాత సమంత  కొద్ది రోజులు సినిమాలకు గుడ్ బై  చెప్పింది. మయోసైటిస్ వ్యాధితో బాధపడి విదేశాలకు వెళ్లి ట్రీట్మెంట్ ను తీసుకుంది. ఇక తన ఆరోగ్యం కుదుటపడడంతో మళ్లీ తెరమీదకు రాబోతోంది. తన సొంత నిర్మాణం సంస్థ ద్వారా

 ప్రేక్షకుల ముందు రానుంది. అయితే సమంత రీసెంట్ గా తన  సోషల్ వేదికగా 'మా బంగారు తల్లి' అనే కొత్త సినిమా  కూడా ప్రకటించింది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అంతా కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం పక్కన పెడితే.... ఇంతకు ఈ సినిమా దర్శకుడు ఎవరు? అనేది ఆమె అభిమానుల్లో నెలకొన్న ప్రశ్న. అయితే ఓ యువ దర్శకుడు దర్శకత్వం చేస్తున్నట్లు ఈ కథ కూడా అతనే రాసినట్లు తాజా సమాచారం. అయితే ఆమె త్వరలోనే ఆ దర్శకుడు పేరుని రిలీజ్

 చేయనుంది. అయితే అందులో సమంత చేయబోతున్న పాత్ర గురించి ఇలా చెబుతూ... ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తున నిలబెడుతుంది. ఈ సినిమాలో మీరంతా కొత్త సమంతను  చూడబోతున్నారు. ఈ సినిమా నటిగా నాకు ఒక సవాల్. మిగతా విషయాలు అన్ని త్వరలోనే చెప్తాను" అంటూ సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే సమంత చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెరమీద కనపడడంతో అభిమానులంతా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: