ఇప్పటివరకు నేను ఇలాంటి క్యారెక్టర్ చెయ్యలేదు.. కృతి శెట్టి..!?

Anilkumar
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను కైవసం చేసుకుంది. ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో. ఆ తర్వాత వరుస సినిమాలు చేసే ఛాన్సును అందుకుంది. అయితే  సినిమాలలో తను  నటించిన పాత్ర రొటీన్ గా ఉండడంవల్ల అభిమానులను అంతగా అలరించలేకపోయింది. తాజాగా కృతి శెట్టి 'మనమే' అనే సినిమాలో శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటించింది. శర్వానంద్ కి ఇది తన 35వ సినిమా. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు

 బ్యానర్ పై తెరకెక్కిస్తుండగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు ,టీజర్ ఇతర ప్రమోషనల్ కంటెంట్ కు ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా తాజాగా లాంచ్ చేశారు. ఆ సందర్భంగా కృతి శెట్టి మీడియాతో మాట్లాడింది. తను ఆ సినిమాలో నటించిన పాత్ర తీరుతెన్నుల్ని బయట పెట్టింది. ఆ ఇంటర్వ్యూలో తను ఇలా చెప్పుకొచ్చింది..." ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు సుభద్ర. నేను ఇప్పటివరకు చేసిన

 సినిమాల కంటే ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నాకు చాలా కొత్తగా ఉంది. నేను ఇప్పటివరకు సినిమాలలో క్యూట్, సాఫ్ట్, బబ్లీ క్యారెక్టర్స్ చేశాను. కానీ ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అయితే డైరెక్టర్ శ్రీరామ్ కి షూటింగ్ టైం లో పాత్ర ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందా అని చాలాసార్లు అడిగాను. అప్పుడు ఆయన అంతే స్ట్రిక్ట్ గా కావాలని చెప్పారు. ఇక నేను ఆయన విజన్ ను ఫాలో అయ్యాను... అంటూ" చెప్పుకొచ్చిందిm ఇదిలా ఉంటే ఈ ఏడాదిలో ఐదు తెలుగు సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చింది. ఇకపై తెలుగు సినిమాలలో గ్యాప్ ఇవ్వదంట ఈ బుట్ట బొమ్మ. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: