రీ రిలీజ్ కి రెడీ అయిన ప్రభాస్ చక్రం.. ఎప్పుడంటే..!?

Anilkumar
తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఫ్యాన్స్ తమ అభిమానం హీరో బర్త్ డే రోజు సందర్భంగా వారు నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాను మళ్ళీ రీ రిలీజ్ చేస్తుంటారు. రీ రిలీజ్ రోజు థియేటర్స్లలో అభిమానుల సందడి అంతా కాదు థియేటర్స్ లో దుమ్మురేపుతుంటారు అభిమానులు. అయితే తాజాగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమా రీ రిలీజ్ కాబోతోంది. తన కెరీర్లో క్లాసిక్ మూవీ గా నిలిచిన చక్రం సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకే వర్షం, మిస్టర్

 పర్ఫెక్ట్ మూవీ తో పాటు ప్రభాస్ నటించిన మరికొన్ని సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. అయితే ప్రభాస్ నటించిన చక్రం సినిమా మరోసారి అభిమానుల ముందుకు రాబోతుంది. స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చక్రం సినిమాను 2005లో గ్రాండ్ గా తెరకెక్కించారు. అప్పట్లో  మాస్ ఇమేజ్ ఉన్న ఆయన ఇలాంటి క్లాస్ సినిమా నటించడంతో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాడు. దానివల్ల ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయినప్పటికీ కూడా ప్రభాస్ కెరీర్ లో ఒక క్లాసిక్ మూవీగా

 నిలిచిపోయింది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా చార్మి, అసిన్ ఇద్దరు హీరోయిన్స్ గా నటించారు. దానితోపాటు ప్రకాష్ రాజ్ పలు కీలక పాత్రలలో నటించగా చక్రి అద్భుతమైన మ్యూజిక్ ను అందించాడు ఆ పాటలు ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా జూన్ 8న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఈగరుగా వెయిట్ చేస్తున్నారు. ఇక  పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా కల్కి. ప్రస్తుతం ఈ సినిమాతో బిజీగా ఉన్నాడు .  ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి దాదాపుగా 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: