ప్రభాస్ దగ్గర ఉన్న ఈ లగ్జరీ కార్ల గురించి తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అంటే అందరూ టక్కున చెప్పే పేరు ప్రభాస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో ప్రభాస్ కి ఫ్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది. అలాంటి పాన్ ఇండియా స్టార్ హీరో నటిస్తున్న లేటెస్ట్ సినిమా కల్కి. ప్రస్తుతం ఈ సినిమాతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. అయితే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి దాదాపుగా 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి

 సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఈ సినిమా 27న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు డార్లింగ్. అయితే తాజాగా ఇప్పుడు ప్రభాస్ లైఫ్ స్టైల్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వినబడుతోంది. అదేంటంటే ప్రభాస్ ఆస్తి విలువ దాదాపుగా 240 కోట్లకు పైగానే ఉంటుంది అని అంటున్నారు. అంతేకాదు ఆయన దగ్గర ఒక్కొక్క బ్రాండ్ ఎండార్స్మెంట్ కి దాదాపుగా రెండు కోట్లు వసూలు చేస్తున్నారట. అంతేకాదు ప్రభాస్ దగ్గర విలాసవంతమైన కార్లు కూడా ఉన్నట్లుగా సమాచారం వినబడుతుంది. మరి ఆయన దగ్గర ఉన్న ఆ

 విలాసవంతమైన కార్ల కలెక్షన్ ఏంటో ఇప్పుడు మనం కూడా చూసేద్దాం..
ప్రభాస్ వద్ద రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఉంది. దీని విలువ దాదాపు రూ.8 కోట్లు. అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, అమితాబ్ వద్ద ఈ కారు ఉంది. అలాగే ప్రభాస్ వద్ద జాగ్వార్ XJR కారు ఉంది. దీని విలువ రూ. 2.08 కోట్లు ఖరీదు. ఈ స్వాంకీ జాగ్వార్ XJR కారును ఇటీవల కార్తీకేయ నటించిన భజే వాయువేగం షూటింగ్ కోసం ఇచ్చారు. అలాగే డార్లింగ్ దగ్గర రూ.1 కోటి విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారు ఉంది. ఇవే కాకుండా ప్రభాస్ గ్యారేజీలో రూ.6 కోట్లు ఖరీదైన లాంబోర్గినీ అవెంటడోర్ రోడ్‌స్టర్ కూడా ఉంది. అలాగే రూ.68 లక్షల విలువైన bmw X3 ఉందట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: