పిఠాపురంలో మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..!?

Anilkumar
టైర్ 2 హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న శర్వానంద్ ప్రస్తుతం మనమే అనే సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇందులో భాగంగానే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. అయితే ఇటీవల మనమే ట్రైలర్ సైతం విడుదల చేశారు మేకర్స్. ఇక మనమే ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాతో హిట్టు కొట్టేలాగా కనిపిస్తున్నాడు.  గత కొంతకాలంగా వరుస ఫ్లాప్స్ తో సతమవుతమవుతున్న శర్వానంద్ ఈ సినిమా పైనే నమ్మకం పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాతో అయినా

 శర్వానంద్ హిట్ కొడతాడా లేదా అన్నది చూడాలి. అయితే జూన్ 7న విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ సార్ నిర్వహిస్తున్నారు చిత్ర బృందం. అందులో భాగంగానే  ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను పిఠాపురంలో నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎలక్షన్ రిజల్ట్స్ హడావిడి జరుగుతోంది. కాబట్టి రిజల్ట్ తర్వాత రోజు అంటే జూన్ 5న మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్  పిఠాపురంలో జరపడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు చిత్రబంధం. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇప్పటివరకు అనుమతులు అయితే

 రాలేదు కానీ అక్కడే దాదాపుగా ఖరారు అయినట్లుగా సమాచారం వినబడుతోంది. మరి ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ ఎవరు అన్న వార్తలు ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. కాగా తాజాగా అందుతున్న సమాచారం మేరకు.. మనమే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లుగా సమాచారం. ఇకపోతే శర్వానంద్ రామ్ చరణ్ కి మధ్య ఉన్న అనుబంధం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం నెలకొంది. అందుకే ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రావడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఇటీవల ఈ సినిమా యొక్క ట్రైలర్ కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: