ఇండియన్ 2 నుండి కాజల్ అగర్వాల్ సీన్స్ డిలీట్..!?

Anilkumar
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్ 2 సినిమా కోసం తెలుగు సినిమా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇందులో విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కాగా భారతీయుడు 2 సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. కానీ ఎట్టకేలకు విడుదల తేదీ లాక్ చేసుకుని జులై 12న తెలుగుతో పాటు తమిళం లో కూడా గ్రాండ్గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగానే

 ఇప్పుడు ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం చెన్నైలో శనివారం రాత్రి జరిగింది. ఇక ఆ ఈవెంట్లో భాగంగా డైరెక్టర్ శంకర్ చేసిన పలు కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే శనివారం రాత్రి జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్ కి చిత్ర బృందం తో పాటు పలువురు స్టార్స్ కూడా రావడం జరిగింది. అయితే ఆ ఈవెంట్ కి కాజల్ అగర్వాల్ కూడా వచ్చింది. ఇక అందులో భాగంగానే డైరెక్టర్ శంకర్ ఇండియన్ టు సినిమాలో కాజల్ కనిపించదు అంటూ షాక్ ఇచ్చాడు. అంతేకాదు కాజల్ కి సంబంధించి షూట్

 చేసిన సన్నివేశాలు ఇండియన్ 3 లో ఉంటాయి అని బాంబు పేల్చాడు. ఇక ఈ విషయం విన్న కాజల్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు .అంతేకాదు ఒకింత డైరెక్టర్ శంకర్ పై మండిపడుతున్నారు. ఇకపోతే కమలహాసన్ కాజల్ అగర్వాల్ మొదటిసారి కలసి నటించిన సినిమా ఇది. అందుకే ఈ సినిమా కోసం కాజల్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ ఇప్పుడు మాత్రం కాజల్ కి సంబంధించిన సన్నివేశాలను ఇండియన్ టు లో డిలీట్ చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇకపోతే  ఇండియన్ 2లో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నారు. ఎస్‌జే సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: