కల్కి రన్ టైం లాక్.. ఎంతసేపు అంటే..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా కల్కి. నాగ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కాగా జూన్ 27న తెలుగుతోపాటు హిందీ మలయాళ కన్నడ తమిళ అన్ని భాషల్లో విడుదలవుతోంది ఈ సినిమా.  ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని ధత్ భారీ బడ్జెట్ తో తన కూతుర్లు స్వప్న దత్ ప్రియాంక ధత్ లతో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపుగా 600 కోట్ల పైగానే భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే తారస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇక అందులో భాగంగా ఇప్పటికే సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ బుజ్జి అనే కార్ వీడియోని కూడా విడుదల చేసి భారీ

 రెస్పాన్స్ తెచ్చుకున్నారు. ఇక ఇటీవల బుజ్జి కి సంబంధించిన ఒక ప్రమోషనల్ ఈవెంట్ కూడా నిర్వహించారు చిత్ర బృందం.  ఆ ప్రమోషన్స్ లో భాగంగా సినిమా ఎలా ఉండబోతోంది బుజ్జి పాత్ర సినిమాలో ఎలా ఉంటుంది అన్నదానిపై క్లారిటీ ఇచ్చారు. అలాగే తాజాగా బుజ్జి భైరవ పాత్రలను పరిచయం చేస్తూ యానిమేటెడ్ వెబ్ సిరీస్ సైతం విడుదల చేశారు మేకర్స్. దానికి సైతం సోషల్ మీడియాలో బాగా రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏంటంటే.. కల్కి సినిమా కథ చాలా పెద్దగా ఉంటుందని అంటున్నారు. అందుకే రన్ టైం చాలా ఎక్కువగా ఉంటుంది అని తెలుస్తోంది.

 తాజాగా అందుతున్న సమాచారం మేరకు కల్కి సినిమా రన్ టైం 2 గంటల 51 నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది. అంటే దాదాపుగా మూడు గంటల పాటు ఈ సినిమా రన్ టైం కొనసాగుతుందని అంటున్నారు. ఎందుకు అంటే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు కమలహాసన్ అమితాబచ్చన్ వంటి స్టార్స్ సైతం నటిస్తున్నారు. అంతేకాదు సినిమాలో వాళ్ళకి కూడా బ్యాక్ స్టోరీస్ ఉంటాయని అంటున్నారు. అందుకే సినిమా రన్ టైం చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయట. సినిమా రన్ టైం పెద్దగా ఉంది కాబట్టి దీనికి సెకండ్ పార్ట్ ఏమైనా ఉంటుందా అని ఇప్పుడు ఈ వార్త తెలిసిన తర్వాత అందరూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. కానీ ఇప్పటివరకు అయితే రెండవ పార్ట్ గురించి ఎక్కడ ప్రకటన మాత్రం చేయలేదు. కానీ రెండో పార్ట్ ఉండే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం వినబడుతోంది. మరి భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ సినిమా ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: