భర్త, పిల్లలతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నయనతార.. పిక్స్ వైరల్..!

Anilkumar
స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే నయనతార ఇప్పుడు కాస్త సినిమాలకి గ్యాప్ ఇచ్చి తన భర్త పిల్లలతో ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం సినిమాలకు  దూరంగా ఉంటూ తన భర్త పిల్లలతో వెకేషన్ కి వెళ్ళింది నయనతార. అంతేకాదు తను టూర్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటుంది. ఇక  అసలు విషయం ఏంటంటే.. నయనతార ప్రస్తుతం సినిమాలతో ఎంత బిజీగా ఉందో తెలిసిందే.

 కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు మలయాళ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక ఇటీవల బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. జవాన్ అనే సినిమాలో నటించి మొదటి సినిమాతోనే హిందీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అక్కడ కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత  నయనతార కి బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నట్లుగా సమాచారం వినబడుతుంది. అలాగే తెలుగులో కూడా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో  తన పిల్లలతో కలిసి వెకేషన్ కి వెళ్ళింది నాయనతార. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అవి ప్రస్తుతం ఎంతో వైరల్ గా

 మారాయి. అయితే అందులో భాగంగానే తాజాగా హాంకాంగ్ లోని డిస్నీల్యాండ్ రిసార్ట్ కు తన కుటుంబంతో కలిసి వెళ్లింది నయనతార. వాటికి సంబంధించిన ఫోటోలను వారి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు నయనతార భర్త విఘ్నేశ్ శివన్. ఇందులో భాగంగానే ఆయన ఒక పోస్ట్ పెట్టి దానికి ఒక క్యాప్షన్ కూడా జోడించాడు.. అయితే అందులో ఆయన... '12 ఏళ్ల క్రితం కాళ్లకు చెప్పులు వేసుకుని కేవలం వెయ్యి రూపాయలతో ఇక్కడ నిల్చున్నాను. పోడా పొడి షూటింగ్‌ కోసం అనుమతివ్వమని అర్థించాను' అని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు విఘ్నేశ్. 'మళ్లీ పుష్కరకాలం తర్వాత మరోసారి నా లవ్లీ బేబీస్‌ నయనతార, ఉయిర్‌, ఉలగ్‌తో డిస్నీలాండ్‌ రిసార్ట్‌లో అడుగుపెట్టాను. జీవితం ఎంత అందమైనది' అని ఎమోషనలయ్యాడు నయన తార భర్త.  ఇక ఈ వెకేషన్ లో నయనతార కుమారులు ఉయిర్‌, ఉలగ్‌లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వీరి ఫొటోలను చూసిన అభిమానులు, నెటిజన్లు ఎంతో క్యూట్ గా ఉన్నారంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: