మూడోసారి తండ్రి కాబోతున్న శివ కార్తికేయన్..!?

Anilkumar
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే గత కొద్ది రోజులుగా శివ కార్తికేయన్ మళ్లీ తండ్రి కాబోతున్నాడు.. ఆమె భార్య మళ్లీ గర్భవతి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఆ ప్రశ్నలకి అవును అనే సమాధానమే వినబడుతోంది. వాటికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియోలో బేబీ బంప్ తో కనిపించింది శివ కార్తికేయన్ భార్య. అయితే ఇదివరకే ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్న సంగతి

 చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ మూడవ బిడ్డ కు జన్మనివ్వబోతున్నారు ఈ దంపతులు. ఇక అసలు విషయం ఏంటంటే.. తాజాగా ఒక అభిమాని పుట్టినరోజు ఫంక్షన్ లో కనిపించాడు శివ కార్తికేయన్. ఇక ఆయనతో పాటు ఆయన భార్య కూతురు కూడా ఉన్నారు.  ఆ వీడియోలో శివ కార్తికేయన్ భార్య ఆర్తి పూర్తిగా గర్భవతిగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఆ వీడియోని చూసిన వారందరూ అది బేబీ బంప్ అనే భావిస్తున్నారు. అంతేకాదు త్వరలోనే మరొక జూనియర్ శివ కార్తికేయన్ రాబోతున్నాడు అని

 సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోకి కామెంట్స్ చేస్తున్నారు ఆయన అభిమానులు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయం శివకార్తికేయన్ ఇంకా అధికారికంగా వెల్లడించక ముందే ఆయన అభిమానులు వాళ్ళ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా శివ కార్తికేయన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. 2010లో ఆర్తిని వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమ బంధానికి ప్రతీకగా 2013లో కూతురు ఆరాధన, 2021లో కుమారుడు గుగన్‌ దాస్‌ జన్మించారు. కాగా శివ కార్తికేయన్ భార్య ఆర్తికి కన్నడ ఇండస్ట్రీతో పరిచయం ఉంది. కనా అనే కన్నడ మూవీలో వాయడి పేట పుల్ల అనే సాంగ్‌ ఆలపించి బాగా ఫేమస్ అయిపోంది. ఇక శివ కార్తికేయన్ కూడా మంచి సింగర్. ఇక ల విషయానికి వస్తే.. ప్రస్తుతం అమరన్ అనే లో నటిస్తున్నాడు శివ కార్తికేయన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: