వారంలో.. వాళ్లు నా పెళ్లి చేసేలా ఉన్నారు : జాన్వి కపూర్

praveen
అతిలోకసుందరి దివంగత నటి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది జాన్వికపూర్   ఈ క్రమంలోనే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మారింది అన్న విషయం తెలిసిందే. ఒకవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూ వారితో రొమాన్స్ చేస్తూ ఇంకోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తుంది. అయితే మొన్నటి వరకు కేవలం బాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది.

 తన తల్లికి ఎంతో ఇష్టమైన తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది జాన్వి కపూర్. ఈ క్రమంలోనే త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ తో దేవర అనే మూవీలో నటిస్తూ ఉంది. ఇక మరోవైపు అటు చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో కూడా హీరోయిన్గా ఎంపికైంది జాన్వికపూర్. అయితే ఈ అమ్మడు ఎన్నో రోజుల నుంచి ఒక వ్యక్తితో రిలేషన్షిప్ లో కొనసాగుతుంది. శిఖర్ పహారియాను ప్రేమిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయం అఫీషియల్ గా కూడా ప్రకటించేసింది. వీరిద్దరూ మీడియా ముందే చట్టపట్టలేసుకొని తిరుగుతూ ఉంటారు.

 అయితే జాన్వి కపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియాని త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ కొన్ని వార్తలు బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై జాన్వి స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇటీవల నా మ్యారేజ్ పై కొన్ని స్టుపిడ్ ఆర్టికల్స్ చదివాను. నేను సిద్ధంగా లేకపోయినా ఒక వారంలో వాళ్ళే ఇక నా పెళ్లి చేసేలా కనిపిస్తున్నారు. ఇప్పుడు తాను పెళ్ళికి సిద్ధంగా లేను అంటూ చెప్పుకొచ్చింది జాన్వి కపూర్. కేవలం నటన మీదే తన దృష్టి ఉంది అంటూ తెలిపింది. కాగా జాన్వి కపూర్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టర్ అండ్ మిస్సెస్ మహి సినిమా మే 31వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం బిజీగా ఉంది ఈ హీరోయిన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: