పుష్ప విలన్ కు అనారోగ్య సమస్యలు !

Seetha Sailaja
మళయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మంచి నటుడు మాత్రమే కాకుండా నిర్మాత దర్శకుడు కూడ. ‘పుష్ప’ మూవీలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు ఈ నటుడు విపరీతంగా కనెక్ట్ అయ్యాడు. ఈమూవీలో అతడు నటించింది కేవలం 20 నిముషాలు మాత్రమే అయినప్పటికీ ఆసినిమా ఘన విజయంలో అతడి కీలక పాత్రను ఎవరు కాదనలేరు.

ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణలో ఉన్న ‘పుష్ప 2’ చిత్రీకరణలో బిజీగా ఉన్న ఫాహద్ ఫాజిల్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు వచ్చిన ఒక అరుదైన అనారోగ్యానికి సంబంధించిన వివరాలను తెలియచేసి చాలామందికి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ విలక్షణ నటుడు ఏడీహెచ్‌డీ అనే అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నట్లు తెలియచేశాడు.  

ఏడీహెచ్‌డీ అంటే అటెన్షన్ డెఫిషిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ ఇది మెదడు పనితీరు పై తీవ్ర ప్రభావం చూపుతుందట. సాధారణంగా ఇలాంటి అనారోగ్యం చిన్న పిల్లలలో వస్తుందనీ అయితే తనకు కొన్ని సంవత్సరాలు బట్టి ఈ అనారోగ్యం బాధ పెడుతోంది అంటూ తన అనారోగ్య లక్షణాలను వివరించాడు.

ఇలాంటి అనారోగ్యం ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో కొన్ని మార్పులు కనిపిస్తాయనీ ప్రతి చిన్న విషయానికి అలాంటి వారు తొందరగా ఆవేశపడుతూ ఉండటంతో కొన్ని అనుకోని సమస్యలు వత్తు ఉంటాయని తెలియచేశాడు. ఈ వ్యాధి నివారణకు సరైన మందులు లేవనీ ఇంకా పరిశోధనలో ఈ వ్యాధి లక్షణాలు నివారణ ఉన్నాయాని అంటున్నారు. ఒక వ్యక్తికి ఏడీహెచ్‌డీ ఎందుకు వస్తుందో చెప్పడానికి నిర్దిష్టమైన కారణాలు ఏమీ లేవు.

దీనిపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్న విషయాన్ని తెలియ చేశాడు. ఈ వ్యాధి నియంత్రణకు థెరపీ తో పాటు  కొన్ని మందులు అవసరం అని అంటున్నాడు. ప్రస్తుతం సినిమా సెలిబ్రెటీలకు రకరకాల అరుదైన అనారోగ్య సమస్యలు వస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఇలాంటి అనారోగ్యాల గురించి సినిమా సలిబ్రెటీలు బయటకు చెప్పేవారు కాదు. అయితే ఇప్పుడు చాలామంది తమ అనారోగ్య సమస్యలను ధైర్యంగా వెల్లడిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: