SR.ఎన్టీఆర్ ఎందుకు హనుమంతుడి పాత్ర చేయలేదో తెలుసా..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన పాత్రలను వేయగలిగిన ఏకైక నటుడుగా పేరుపొందారు నందమూరి తారక రామారావు. ఈ రోజున 101వ జయంతి  ఈరోజు కావడం చేత అభిమానులు కుటుంబ సభ్యులు సైతం ఎన్టీఆర్ ఘాటు వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడు ,పౌరాణిక పాత్రలలో అన్ని పాత్రలు కొట్టిన పిండి అని చెప్పవచ్చు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటించగలిగిన నటుడు

సీనియర్ ఎన్టీఆర్ తన సినీ ప్రస్థానంలో నారదుడు, హనుమంతుడు పాత్రలు మాత్రం వేయలేదు. ఈ విషయాన్ని ఒకసారి ఆయన వద్ద ప్రస్తావించగా.. ఏం చెప్పారంటే..?అయితే అప్పట్లో షూటింగ్ సమయాలలో కూడా కొన్ని గంటలపాటు కరెంటు పోయేదట కరెంటు వచ్చేదాకా అందరూ కూర్చొని మాట్లాడుకునే వారట. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ గారు చెప్పే మాటలు అందరూ ఆసక్తిగా వింటూ ఉండేవారట. అయితే ఎన్టీఆర్ దగ్గర ఉన్న రావి కొండలరావు ఒక విషయాన్ని అడుగుతూ.. నారదుడు, హనుమంతుడు వంటి ముఖ్యపాత్రలే కదా అన్నగారు ఎందుకు ఇందులో మిమ్మల్ని చూసే అవకాశం లేదా అని అడిగారు..

అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ బదిలిస్తూ నారదుడిగా ఆలోచించాను బ్రదర్ హాస్యం  వచ్చేలా కాకుండా భక్తుడిగా సర్వజ్ఞుడిగా గంభీరంగా ప్రదర్శించవచ్చు.కానీ తన రూపం అందుకు సహకరించదని ఆ సాహసం చేయలేదని తెలిపారు. తన శరీరం కాస్త బరువుగా ఉంటుంది అందుకే ఆ ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదని తెలిపారు. ఇక హనుమంతుడి పాత్ర విషయానికి వస్తే.. నా ముఖం కానప్పుడు నాకెందుకు ఆ పాత్ర మాస్క్ తో నటించాలి ఫిజికల్ మూమెంట్స్ కాస్త ఎక్కువగా చేయాలి అంటూ తెలిపారట.ఎన్నో పాత్రలు ఒదిగిపోయిన సీనియర్ ఎన్టీఆర్ ఇప్పటికి తెలుగువారి గుండెలలో అభిమాన నటుడు గానే మిగిలిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: