వైరల్ అవుతున్నజాన్వి కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali krishna
ఒకప్పుడు టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ ను కూడా ఏలిన ప్రముఖ నటి శ్రీదేవి 2018లో కన్నుమూసిన విషయం తెలిసిందే. దుబాయ్ లోని ఓ హోటల్లో నీటిలో మునిగి ఆమె చనిపోయినట్లు పోస్ట్ మార్టమ్ రిపోర్టు వెల్లడించింది.జాన్వీ కపూర్ శుక్రవారం హెయిర్ కట్ చేయించుకోదట.. అంతేకాదు బ్లాక్ కూడా వేసుకోదట. దీని వెనుక బలమైన కారణమే ఉంది. తన తల్లి శ్రీదేవి ఉన్నప్పుడు వాటిని ఫాలో అయ్యేదని, అప్పుడు తాను వాటిని మూఢనమ్మకాలుగా భావించినా..ఆమె చనిపోయిన తర్వాత ఫాలో అవుతున్నట్లు చెప్పడం విశేషం. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో జాన్వీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.మన ఇళ్లలోనూ మనం కొన్ని పాటిస్తుంటాం. ప్రతి ఒక్కరికీ కొన్ని నమ్మకాలు ఉంటాయి. తన తల్లిదండ్రులు, పూర్వీకులు పాటించిన కొన్నింటిని కేవలం మూఢనమ్మకాలుగా కొట్టి పారేస్తూ మనం వాటిని లైట్ తీసుకుంటాం. జాన్వీ కూడా ఒకప్పుడు అలాగే ఉండేదట. తన తల్లి శ్రీదేవి చేసే పనులను తాను పట్టించుకునేదానని కాదని, కానీ ఆమె చనిపోయిన తర్వాత మత విశ్వాసాలపై మరింత నమ్మకం కుదిరిందని చెప్పడం విశేషం.
ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న జాన్వీ.. తాను ఫాలో అవుతున్న నమ్మకాల గురించి మాట్లాడింది. హిందూ మత విశ్వాసాలను ప్రస్తుతం తాను ఎంతలా ఫాలో అవుతున్నదీ ఈ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది.ఈ ఇంటర్వ్యూలో తల్లి శ్రీదేవి గురించి జాన్వీ మాట్లాడింది. "ఆమె కొన్ని విషయాలను బాగా విశ్వసించేది. కొన్ని పనులను కొన్ని ప్రత్యేకమైన రోజుల్లోనే చేయాలి.. శుక్రవారం హెయిర్ కట్ చేయించుకోవద్దు ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు.. శుక్రవారాలు బ్లాక్ డ్రెస్ వేసుకోద్దు.. అనేది. ఇలాంటి మూఢనమ్మకాలను నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఆమె చనిపోయిన తర్వాత నేను వాటిని నమ్మడం మొదలుపెట్టాను. నిజానికి మరింత ఎక్కువగా నమ్మాను. ఆమె ఉన్నప్పుడు నేను మత విశ్వాసాలను నేను ఇంతగా పట్టించుకున్నానా లేదా అన్నది నాకు తెలియదు. అమ్మ ఉన్నప్పుడు ఆమె వీటిని విశ్వసిస్తుందని మేమందరం కూడా చేసే వాళ్లం. కానీ ఆమె చనిపోయిన తర్వాత మన హిందూయిజం సంస్కృతి, చరిత్రతో మనకున్న సంబంధంతో మత విశ్వాసాలపై నా నమ్మకం మరింత పెరిగిపోయింది" అని జాన్వీ చెప్పడం విశేషం.జాన్వీ ఇప్పటికీ తరచుగా వస్తూ తిరుమల శ్రీవారిని దర్శించకుంటుందన్న విషయం తెలిసిందే. దీని గురించి కూడా ఆమె స్పందించింది. "ఆమె ఆ దేవుడి పేరును ఎప్పుడూ తలచుకుంటూ ఉండేది. నారాయణ నారాయణ నారాయణ అంటూ ఉండేది. తాను నటిస్తున్న రోజుల్లో ప్రతి ఏటా తన పుట్టిన రోజు నాడు ఆ గుడికి వెళ్లేది. పెళ్లి తర్వాత వెళ్లలేదు. ఆమె చనిపోయిన తర్వాత తన పుట్టిన రోజు నాడు ఆ గుడికి వెళ్లాలని నేను నిర్ణయించుకున్నాను. తొలిసారి అలా చేసినప్పుడు నేను ఎమోషనల్ అయ్యాను. అదే సమయంలో మానసిక ప్రశాంతత కూడా లభించింది" అని జాన్వీ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: