కార్తీ కొత్త సినిమా టైటిల్.. ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది..!

MADDIBOINA AJAY KUMAR
తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటలలో కార్తీ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో తమిళ బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో విడుదల చేశాడు. అందులో కొన్ని మూవీ లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో ఈయనకు తెలుగు లో కూడా సూపర్ మార్కెట్ ఉంది. దానితో కార్తీ దాదాపుగా తాను నటించిన ప్రతి సినిమాను తెలుగు లో విడుదల చేస్తూ వస్తున్నాడు.
 

ఆఖరుగా కార్తి "జపాన్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని కూడా ఈయన తెలుగు లో విడుదల చేశాడు. ఇకపోతే తాజాగా కార్తీ లేటెస్ట్ మూవీ కి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం కార్తీ , నలన్ కుమార స్వామి దర్శకత్వం లో రూపొందుతున్న ఓ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి వా వాతియార్ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ ఈ సినిమాలోని కార్తీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇకపోతే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కార్తీ క్లీన్ షేవ్ చేసుకొని పోలీస్ యూనిఫామ్ లో వేసుకొని ఉన్నాడు.

దీనితో ఈ సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు స్పష్టం అయ్యింది. గతంలో కూడా కార్తీ చాలా సినిమాలలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన చాలా సినిమాలు మంచి విజయం సాధించడంతో ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంటుంది అని ఈయన అభిమానులు అనుకుంటున్నారు. మరి ఈ సినిమాతో కార్తీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: