మహేష్ బాబు హెయిర్ గురించి అసలు నిజం బయటపెట్టిన సితార..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న మహేష్ బాబు  చేసిన ప్రతి ఒక్క సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన రకరకాల వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ ఇప్పటివరకు దీనికి

 సంబంధించిన ఒక అధికారిక ప్రకటన కూడా బయటికి రాలేదు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు అలాంటి పాత్రలో కనిపిస్తాడు ఇలాంటి పాత్రలో కనిపిస్తాడు అని రూమర్స్ రావడం తప్పించి ఒక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ సైతం లేదు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా మహేష్ బాబు జుట్టుకి సంబంధించిన పలు రకాల వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. అందులో ముఖ్యంగా మహేష్ బాబు ఆయన ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు తన అక్క మహేష్ బాబు జుట్టుని పట్టుకోడానికి వెళ్ళింది. దాంతో మహేష్ బాబు

 ఒక్కసారిగా వెనక్కి జరిగి పోయాడు. ఇక అది చూసిన చాలామంది అది రియల్ జుట్టు కాదు విగ్ అంటూ కామెంట్లు సైతం చేశారు. కానీ దానిపై మహేష్ బాబు ఎప్పుడు స్పందించలేదు. అయితే మరికొందరు మాత్రం జుట్టు ఊడిపోతుంది అన్న ఉద్దేశంతోనే మహేష్ బాబు అలా చేశాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా ఆయన కూతురు సితార ఈ విషయంపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.. ఆ రోజు ఫంక్షన్ లో మా అత్తమ్మ నాన్న జుట్టు మీద చెయ్యి వేయడంతో.. నాన్న ప్లీజ్ నా హెయిర్ మీద మాత్రం చేయి వేయకు అని అత్తకి చెప్పాడు అని చెప్పింది సితార. అంతేకాదు మా నాన్నకి జుట్టు అంటే చాలా ఇష్టం అని.. ఆయన జుట్టుని ఎవరైనా ముట్టుకుంటే తనకి అస్సలు నచ్చదు అని చెప్పింది. దీంతో సితార చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: