ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నా.. బ్రేకప్ పై శృతిహాసన్ కామెంట్స్ వైరల్..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో  చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఆమె శాంతను అనే వ్యక్తితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది.  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరూ విడిపోయ్ ఆరు నెలలకు పైగానే అవుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు తన ప్రియుడితో బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చింది శృతిహాసన్. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ.." ప్రస్తుతం నేను సింగల్

 గానే ఉన్నాను అని.. రిలేషన్షిప్ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ తెలిపింది. అంతేకాదు ప్రస్తుతానికి నా పనిలో నేను బిజీగా ఉన్నాను అని.. నా లైఫ్ నేను ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాను అని శృతిహాసన్ చెప్పింది .అంతేకాదు అదొక క్రేజీ ప్రేమాయణం అని.. అందులో నా గురించి నేను ఎన్నో విషయాలను తెలుసుకున్నాను అని.. అదే సమయంలో ఇతరుల గురించి కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను అని తెలిపింది. దీంతో శృతిహాసన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో తన

 ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను శృతిహాసన్ తన సోషల్ మీడియాలో అన్నిట్లో డిలిట్ చేసేసింది. ప్రస్తుతం వారిద్దరికీ సంబంధించిన ఫోటోలు లేవు. దాంతో ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. ఎంతో కాలంగా వైరల్ అవుతున్న ఈ వార్తలు ఇప్పుడు నిజమే అని  ఇప్పుడు శృతిహాసన్ మాటలు వింటుంటే నిజమే అని తేలిపోయింది. ఇకపోతే ఇటీవల సలార్ సినిమాతో బ్లాక్బస్టర్ అందుకున్న శృతిహాసన్ ఇప్పుడు సలార్ 2 లో సైతం నటిస్తోంది. కానీ దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఇంకా రాలేదు. ఇకపోతే శృతిహాసన్ తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే మాత్రమే నటిస్తుంది. పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోతే ఆ సినిమా చేయడానికి ఒప్పుకోదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: