థియేటర్.. ఓటిటి హిట్.. బుల్లితెరపై మార్క్ ఆంటోనీ కి అలాంటి రిజల్ట్..?

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విశాల్ కొంత కాలం క్రితం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన మార్క్ ఆంటోనీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటు వంటి రీతు వర్మ హీరోయిన్ గా నటించగా ... దర్శకుడు మరియు నటుడు అయినటువంటి ఎస్ జే సూర్య ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించాడు. తమిళ్ తెలుగు భాషల్లో ఒకే రోజు విడుదల అయిన ఈ సినిమా తమిళ్ లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోగా , తెలుగు లో మంచి విజయాన్ని అందుకుంది.

ఇలా మొదట థియేటర్ లలో సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా ఆ తర్వాత ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా తన సత్తా చాటింది. ఇలా థియేటర్ మరియు ఓ టీ టీ లో సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అయింది. ఇక మొదటి సారి ఈ సినిమా జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అయినప్పుడు కేవలం 1.28 టి ఆర్ పి రేటింగ్ ను మాత్రమే తెచ్చుకుంది.

ఇక థియేటర్ లలో బ్లాక్ బాస్టర్ అయిన ఈ సినిమా ఆ తర్వాత ఓ టీ టీ లో కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో మొదటి సారి ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు ప్రేక్షకుల నుండి అదే స్థాయి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమా మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు భారీ స్థాయి టి ఆర్ పి రేటింగ్ ను తెచ్చుకోవడం లో విఫలం అయింది. ఇకపోతే ఈ సినిమాలో విశాల్ నటనకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ మూవీ లో ఎస్ జె సూర్య కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: