ఏంటి.. కల్కి మూవీ ప్రమోషన్స్ కోసం అన్ని కోట్లా.. ఒక పాన్ ఇండియా సినిమా తీయొచ్చు..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా కల్కి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ అభిమానులు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రాబోతోంది. దీంతో కల్కి సినిమాపై రోజురోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు చాలామంది సూపర్ స్టార్స్ కూడా కనిపించబోతున్నారు. అంతేకాదు దాదాపుగా 600 కోట్లకు పైగానే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను

 నిర్మిస్తున్నారు. అశ్విని దత్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ తన ముందు సినిమాల కంటే చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లుగా సమాచారం వినబడుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మూవీ పోస్టర్స్ అన్నీ కూడా భారీ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలోనే విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్స్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అని ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. దాదాపుగా కల్కి సినిమా కోసం 600 కోట్లకు పైగానే

 బడ్జెట్ పెట్టారు. ఇక విడుదలైన తర్వాత దాదాపుగా 1000 కోట్లకు పైగానే ఈ సినిమా వసూలు చేయాలి అని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాలను జనాల్లోకి తీసుకు వెళ్లడానికి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. అంతే కాకుండా దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ ప్రమోషన్ జరగనుంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం'కల్కి 2898 AD' ప్రమోషన్స్ బడ్జెట్ 40-60 కోట్లు. ఈ డబ్బుతో ఓ భారీ సినిమా ను తీయొచ్చు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక 'కల్కి 2898 AD'లో ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ నటిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: