ఏంది బాసూ ఇది.. నాగార్జున హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి?

praveen
అక్కినేని అభిమానులందరికీ కూడా నాగార్జున కెరియర్లో చేసిన ఎన్నో సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతూ ఉంటాయి. అయితే రెండు దశాబ్దాలు గడుస్తున్న ఇంకా అందరికీ ఫేవరెట్ గా ఎవర్గ్రీన్ మూవీ గా కొనసాగుతున్న సినిమా గీతాంజలి. దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెలుగులో తీసిన ఏకైక సినిమా ఇది. అప్పట్లో గీతాంజలి సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మూవీ ఇప్పటికీ టీవీలలో వచ్చినా కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు.

 ట్రాజడీ లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచింది అని చెప్పాలి. అయితే ఈ మూవీలో నాగార్జున సరసన గిరిజ షెట్టర్ నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అమాయకమైన చూపులతో ఇక తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. అల్లరి పిల్లగా ప్రేమ కోసం పరితపించే సగటు అమ్మాయిగా.. గిరిజ జీవించేసింది అని చెప్పాలి. ఇక నాగార్జున, గిరిజ మధ్య కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులకు ఎంతో బాగా కనెక్ట్ అయింది. లేచిపోదామన్న మొనగాడా అంటూ గిరిజ నాగార్జునతో చెప్పే డైలాగ్ ఇప్పటికీ ఎంతో మందికి ఫేవరెట్.

 అయితే ఇలా గీతాంజలి మూవీ తో ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన గిరిజ ఇప్పుడు ఎక్కడ ఉంది ఏం చేస్తుందో కూడా ఎవరికీ తెలియదు. అయితే ఇటీవల గిరిజకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఆమెను చూసి అటు అభిమానులు కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. ప్రస్తుతం మెడిటేషన్ టీచర్ గా కెరియర్ కొనసాగిస్తుంది. అరబిందో ఇంటిగ్రల్ లైఫ్ సెంటర్ పేరుతో మెడిటేషన్ క్లాస్సెస్ చెబుతుంది. దీంతో ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో అప్పుడు ఎంతో క్యూట్ గా కనిపించిన గిరిజ.. ఇప్పుడు ఇలా మారిపోయింది ఏంటి అంటూ అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: