ట్రెండీ వేర్ లో శ్రీ లీల లేటెస్ట్ లుక్స్ వైరల్..!

Anilkumar
తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ హీరోయిన్ శ్రీ లీల ముందు వరుసలో ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది. ప్రస్తుతం ఏ సినిమా విడుదలైన కూడా అందులో హీరోయిన్గా ఈ ముద్దుగుమ్మ కనిపిస్తోంది. అంతలా టాలీవుడ్ లో తన డిమాండ్ పెరిగిపోయింది.  మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ గుర్తింపు సంపాదించుకుంది. దాని తర్వాత ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన మొదటి

 సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయింది. అయితే ఆమె చేసిన అన్ని సినిమాల్లో ధమాకా సినిమా తప్పించి ఏ సినిమా కూడా అంతటి బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకోలేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా సినిమాలు చేసినప్పటికీ అన్ని సినిమాలు కూడా యావరేజ్ టాక్ ను సంపాదించుకున్నాయి. ఇకపోతే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది శ్రీ లీల తనకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ

 ఉంటుంది. అయితే తాజాగా తన లేటెస్ట్ స్టిల్స్ ను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లూ జీన్స్ బ్లాక్ టాప్ లో మత్తెక్కించే చూపులతో  లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇక  తన సినిమాల విషయానికి వస్తె.. ఈ ఏడాది ఈ ముద్దుగుమ్మ కి అంతగా కలిసి రాలేదు అని చెప్పొచ్చు.  ఈ ఏడాది ఆమె మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బ్లాక్ బస్టర్ ని మాత్రం అందుకోలేకపోయింది. అయితే ఈ ప్రస్తుతం శ్రీ లీల తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న గోట్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేస్తుంది అన్న వార్తలు గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాతో శ్రీ లీల కోలీవుడ్ ఎంట్రీ కి కూడా రెడీ అయినట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: